పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, ఏప్రిల్ 2014, మంగళవారం

Viswanath Goud కవిత

విశ్వ మాలికలు 1.దేహానిది కోరికల దాహం.! తాగేకొద్ది తడారిపోతూనే ఉంటుంది.!! 2.నామనసు మేనానే... నీ తలపులు మోసినంత కాలం.! 3.అచ్చతెలుగు చలనచిత్రాల్లో అష్టవంకరలు పోతూ తెలుగుభాష..! నయమనిపించేలా ఆంగ్లానువాదచిత్రాలు... ఆమోదయోగ్యమైన భాష వాడుతూ.!! 4.అందని ద్రాక్షవే.! కలలో మురిపిస్తూ....ఇలలో మరిపిస్తూ.!! 5.వలపన్నుతోంది నిద్ర.! కళ్ళలో సంచరించే కలలను పట్టుకోవాలని.!! 6.ఎంత దోపిడి..... కష్టం చేతులదైతే..! అలసిపోయి సుఖనిద్రను అనుభవించేదేమో కళ్ళు.!! 7.నీతో జీవించాలనే నా ఆశల కెరటం..! నువ్వు చేరువయిన రోజు తాకుతుందది ఆనందపుతీరం.!! 8.గుండె గూటి చుట్టూ జ్ఞాపకాలు..! మండేవి కొన్నయితే....చల్లార్చేవి మరికొన్ని..!! 9.నీ జ్ఞాపకాలు 'చల్లకుండ'.! నా గుండె తడారినప్పుడల్లాఆశల నీరు పోస్తూ.!! 10.మోతాదుకి మించి కృత్రిమ ఎరువులంటి కపటప్రేమలు.! మనసు చేలల్లో మానవత్వం పండకుండా బీడుచేస్తూ.!! 11.నీదే పెత్తనం.! నామనసునెపుడో నీ దాసిగా చేశా..!! 12.ఇద్దరిదీ ఏకగ్రీవ ఎన్నికే.! పగటి నియోజకవర్గంలో సూరీడు...రాత్రినియోజకవర్గంలో చంద్రుడు.!! 13.గజినీ మహ్మద్ నీ తలపులు.! ఎంత తరిమికొట్టినా దండయాత్ర ఆపవు.!! 14.ఎన్నికలకు సర్వం సిద్ధం.! హామీల ఉచ్చు బిగిస్తూ..ఓటర్లను వేటాడటానికి తయారవుతూ.! 15.పగటి విషయంలో గొడవపడ్డ జంట.! అలిగి కంటినొదిలి కనుమరుగవుతూ కల.!! 16.జ్వలిస్తూ మది గుండంలోని జ్ఞాపకాల కణకణాలు.! కలకలం రేపుతూ బూడిదవుతున్న ఆశల ఆనవాళ్ళు.!! 17.కూరకి పనికిరాని పుట్టగొడుగులు.! రొజుకొకటి పుట్టుకొస్తున్నఈపార్టీలు.!! 18.భేతాళ ప్రశ్నవే నువ్వు.! కోపంగా మాట్లాడినా అలుగుతావు... అనునయించబోతే ఇంకా అలుగుతావు.!! 19.బండను పగిలితేనే ఇళ్ళు కట్టడానికి రాయి దొరికేది.! గుండెను రాయి చేసుకుంటేనే దుఃఖసాగరం నుండి ఒడ్డుచేరేది.!! 20.నాజీవితం ఖరీదు.! నీ మనసు.!! 21.కరుడుగట్టిన కళ్ళు.! తను 'కన్న'కలలను తానే హతమారుస్తూ.!! విశ్వనాథ్ 08APR14

by Viswanath Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g2BvLE

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి