పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, మార్చి 2014, శనివారం

Santosh Kumar K కవిత

||నీ స్నేహం|| శీర్షిక: ఒక యువకుని మదిని తట్టిలేపిన సౌందర్యాన్ని ఇలా వర్ణిస్తూ ఆ సుందర స్నేహన్ని కోరుకుంటూ ఇలా అంటున్నాడు... తేనె గానాల కోయిల పిలిచిందో వసంత రాగాల గాలి వీచిందో సెలయేరు సప్తస్వరాలు పాడుతుందో ఏమైందో తెలియని ఆనందల కచేరీలో ఈ లోకమంతా ఎందుకో కొత్తగా ఉంది.. సరదాల సందడులు పిలుపుచెసాయా అన్నట్టు ఎదలో ఉల్లాసం ఉప్పొంగి ఉరకలేస్తుంది... ముందెపుడు లేని ముచ్చట్లన్నీ నింగినంతా నిండి ఉన్న నీలంలా నా చుట్టూ చేరి తెగ కబుర్లుచెప్తున్నాయి... కారణాలు ఏంటని ఆరా తీస్తే.. ఉత్సాహం రెట్టింపు అయినట్టు, కోరికలు తీరే కాలమొచ్చినట్టు, కలలు నెరవేరే వేకువ పిలిచినట్టు, ఆహ్లాదాల అంబారీలో ఊరేగినట్టు.. ఉత్సాహాల తీరంలో నేనుండగా కోరికల కలల అలలు పోటీపడుతూ కాలం కన్నా వేగంగ ఎగసిపడి ఆహ్లాదంతో నన్ను హత్తుకుంటున్నాయి... అదే అదే చెప్తున్నా... ఎందుకంటే... ముగ్ద మనోహరమైన ఓ మగువా లలిత లావణ్యమైన నీ మనసుతో కోమలమైన నీ చేతి స్పర్శతో నను తాకితే తరించనా తక్షణం.. అయినా ఓ సోయగాల సొగసరి, సోకుల బందీఖానావి.. మన్మథుని ఊహాచిత్రానివి నువ్వు... ఏమని వర్ణించగలను నీ నవ్వు... నా కళ్ళలో తొలిసారిగా నీ ముఖారవిందం వికసించింది.. నా చూపులకు తొలిసారిగా నీ గులాబీ చెక్కిల్లు పరిచయమయ్యాయి.. నా చెవులకు చిలిపిగా నీ పలుకులు సరిగమలను ఆలపించాయి.. నా ఊహలకు ఊపిరినిస్తూ నీ జాలువారే కురులు సయ్యాటలాడాయి.. నా మురిసిన ఆలోచనలో నీ మెరిసిన దరహాసం నాట్యమాడింది... ఆ తరుణంలో.. వెలకట్టలేని నీ పరిచయంలో అనువనువునా తోడు నీడగా నేనుంటా.. పున్నమి రాతిరి వెలుగులా మారి నా మదినిండా నిన్నే నింపుకుంటా.. నీ సమయంలో క్షణ కాలాన్నిస్తే చాలు అందులో నా జీవితాన్ని మలుచుకుంటా.. నా ప్రేమ దివిసీమలో నీరాకతో ప్రణయ ప్రయాణానికి తొలి అడుగులువేసి నా సంతోషానికి ఒంటరి చిరునామాగా నువ్వుండాలనే కాంక్షతో కోరుకుంటున్నా నీ బంధం.. నీ స్నేహం... #సంతోషహేలి #Sanoetics 01MAR2014

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kBTRmM

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి