పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, మార్చి 2014, శనివారం

Vakkalanka Vaseera కవిత

హృద‌యం రాత్రి మెత్త‌ని చేతులు చాచి ఈ పిల్ల‌ని ప్రేమ‌గా నిమురుతుంది మొత్త‌టి మ‌బ్బుల బొంత‌లు ప‌రిచి గుప్పెడు న‌క్ష‌త్రాల్ని చుట్టూ చ‌ల్లి ఏకంగా ఓ చంద‌మామ‌నే దిండు ప‌క్క‌న పెట్టినా ఈ పిల్ల‌మాత్రం నోరు వెళ్ల‌బెట్టుకుని క‌ళ్లూ చెవులూ అప్ప‌గించి పిట్ట‌ల‌తో ఎక్క‌డికి వెళ్లిపోయిందో అక్క‌డే సంచ‌రిస్తోంది ఇంకా ఈలోకానికి రాకుండా ఇక్క‌డ దేన్నీ చూడా కుండా బ‌హుశ ఎక్క‌డో ఇంకేదో చూస్తోంది తాను ఎవ‌రి చేతుల్లో నిద్ర‌పోతున్న‌దీ తెలియ‌ని మ‌రోలోకం అర‌చేతుల మీద ఆడుకుంటోంది త‌ల‌నిండా పూల‌తో నిశి నిద్ర‌పోయే లోకం అది ప‌గ‌ళ్లు రెక్క‌లు విప్పి అక్క‌డినుంచే వ‌చ్చే లోకం అది రాత్రీప‌గ‌లూ రెండూ లేని చ‌ల్ల‌ని కాంతి ప‌రిమ‌ళాల వెచ్చ‌ని లోకం కాలం రెక్క‌లు విప్పి గ్ర‌హ‌గోళాల చుట్టూ ప్ర‌ద‌క్షిణ చేసి-- అదే కాలం తిరిగి రెక్క‌లు ముడుచుకుని త‌న గూటిలో నిద్ర‌పోయే..లోకం ఆలోకంలో సంచ‌రిస్తూ ఈలోకంలో మాత్రం రెప్ప‌లు తెరిచి నిద్ర‌పోతోంది స‌ర‌స్సులో స‌ద్దుమ‌ణిగి పోయిన ఒండ్రు మ‌ట్టి బుర‌ద‌లోంచి త‌ల్లిక‌డుపులోంచి తండ్రి నాభిలోంచి ప్ర‌యాణించి- నీటిలోంచి త‌ల‌బ‌య‌ట పెట్టి ప్ర‌పంచాన్ని చూస్తుంది ప‌క్షుల‌తో క‌లిసి కేరింత‌లు కొట్టి తూనీగ‌ల రెక్క‌ల మీది సంగీతాన్ని ముని వేళ్ల‌తో మీటి నాద సౌంద‌ర్యానికి అశ్చ‌ర్య‌పోయి ..ఆనందించి చివ‌రికి నెమ్మ‌దిగా అన్నిరేకులూ నేత్రాలై విచ్చుకున్నాకా ఈలోకంలో రెప్ప‌లు తెరిచి నిద్ర‌పోతూ ఇంకో లోకంలో సంచ‌రిస్తోంది అగ్ని స‌ర‌స్సులో విక‌సించిన‌ రెక్క‌లు లేని కాళ్లు లేని నిశ్చ‌ల హృద‌య క‌మ‌లం ------------వ‌సీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ewAQkZ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి