పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, జూన్ 2014, శుక్రవారం

Thilak Bommaraju కవిత

తిలక్ /కళ్ళ నడక ___________________ ఒకానొక రాత్రిలో ఒంటరిగా నడుస్తూ నేను దారిలో పోసిన కంకర్రాళ్ళలో కొత్త సుగంధాన్ని ఆస్వాదిస్తూ పాక్షికంగా అగుపించే మిణుగురుల భుజాలపై చేతులేసుకుంటూ ఇంతలో అరికాల్లో ఏదో బాధ కళ్ళ తలుపులు తెరవగానే భళ్ళున ఒలికిన కొన్ని నీళ్ళూ ప్రతిరోజూ నిర్లిప్త వక్షాల మధ్యగా నా శరీరం వదిలిన భారాన్ని మొస్తున్న ఓ ఆత్మను పట్టించుకోని నిశ్చల పదార్థం కొన్ని సమయాలు అడుగంటిన బావుల్లో సగం కాలిన ఆశలను చేద వేస్తూ అలసిపోయాక అక్కడెక్కడో మళ్ళా విశ్రమిస్తూ ఇంకో కొత్త ప్రయాణానికి కసరత్తు గతాల ముందు నిబ్బరంగా మోకరిల్లాలని చాలాసార్లే అనుకుంటాను కాని నాలోకి నేను జారిపోయినప్పుడల్లా దివిటీ కరిగిన శబ్ధ నిర్మాణాలు ఒరుసుకుపోయే ఆలోచనలు శ్రామికులై కూలిపోని పునాదుల దాకలాలను కనిపెట్టే ప్రయత్నంలో మళ్ళీ నడక మొదలు ఇంకో దిశగా తిలక్ బొమ్మరాజు 06.06.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nWxXAr

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి