పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, జూన్ 2014, శనివారం

Srinivas Vasudev కవిత

మనం నవ్వు మర్చిపోయామా? ------------------------------- మరయితే ఈ వారం Ogden Nash ని చదువుదామా ! నవ్వటం, నవ్వించటం దాదాపుగా మర్చిపోయామనే అనిపిస్తుంది ఆధునిక యాంత్రిక, జాల యుగంలో. నవ్వలేకపోవటం,నవ్వకపోవటమో రోగమో, హాయిగా మనసారా నవ్వగలటం భోగమో కానీ జంధ్యాల లాంటివారు మళ్ళీ వస్తారనే నమ్మకం నాకైతే లేదు. సెన్సిటివ్ హ్యూమర్, సెన్సిబిల్ హ్యూమర్ ఏమయిపోయాయి? ఒకప్పుడు కేవలం బాపు కార్టూన్లకోసమే పుస్తకాలు కొనేవారంట! తరువాతి కాలంలో మల్లిక్ లాంటి వారూ కేప్షన్ లేకుండానే బ్రహ్మాండమైన హాస్యాన్ని పండించేవారు కార్టూన్లలో. మరిప్పుడు సమస్యేంటీ? నేటి సిన్మాల్లో కమెడియన్లే హీరోలనే స్థాయివరకూ సిన్మాలెదిగినా ఆ కామెడీ చాలా వరకూ dry humour గానో exhaustive humour గానో మిగిలిపోతుంది. ఇంకా విచారించగా నాటకల్లోనూ, కథల్లోనూ కొంతైనా హాస్యాన్ని పండించగలిగినా కవిత్వం మాత్రం హాస్యానికి చాలా దూరంగా ఉండిపోయిందన్నది అత్యంత విచారకరం. నాకు గుర్తున్నంతవరకూ గతపదేళ్ళలో హాస్యప్రధానమైన కవిత ఒక్కటీ చదివిన గుర్తులేదు ( సారీ, ఓ కవిత కవిత్వం కాలేకపోయినప్పుడూ నవ్వుకుంటే ఆ పాపం ఆ కవిది కాదులెండీ). ఆంగ్లంలోను ప్రపంచంలోని ఇతర భాషల్లోనూ ఇంకా హాస్యభరిత కవితలు వస్తున్నా తెలుగులో మాత్రం ఆ కొరత ఇప్పుడప్పుడే తీరే అవకాశం కనిపించట్లేదు. ఈ వారం మన వింగ్డ్ వర్డ్ లో ఓ అమెరికన్ కవి Ogden Nash కవితలు చూద్దాం. దాదాపు 500 కవితలు సరదాగా రాసుకున్న మహనీయుడు. ఉదాహరణగా ఇది చూడండి. చిన్నదే కానీ ఇంతకంటే అవసరమా? The Perfect Husband He tells you when you've got on too much lipstick And helps you with your girdle when your hips stick. అవును ఇతనే పెర్ఫెక్ట్ హజ్బెండ్ మరి. ఆగస్ట్ 19, 1902 న న్యూయార్క్ నగరంలో జన్మించిన నాష్ దాదాపు 68 ఏళ్ళపాటు సాహిత్యానికి తన సేవలందించాడు. 1971 లో ఇతను మరణించినప్పుడూ NewYorkTimes ఇలా నివాళులర్పించింది “his droll verse with its unconventional rhymes made him the country's best-known producer of humorous poetry". అతని రచనలు పద్నాలుగు సంపుటాలుగా ప్రచురితమయ్యాయి!! రైమింగ్ (అంత్యప్రాస) లో హాస్యాన్ని కనుగొన్న నాష్ కవితల్లో 'విషయమూ' లేకపోలేదు. అయితే రైమింగ్ కోసం ప్రాణాలిచ్చే ఇతను ఓ వాక్యం చివర్న పైవాక్యానికి తగ్గమాట పడకపోతే తనే ఓ కొత్త పదాన్ని అప్పటికప్పుడు ప్రయోగించేవాడు. ఆ ప్రయోగం అతనికి జీవితాంతమూ తోడుగా నిల్చింది. మరో ఉదాహరణ : Men seldom make passes At girls who wear glasses: A girl who is bespectacled She may not get her nectacled 1938 లో Nash రాసిన కవిత The Japanese చాల ప్రముఖమైనది: How courteous is the Japanese He always says, Excuse it, please He climbs into his neighbor’s garden And smiles, and says, I beg your pardon He bows and grins a friendly grin And calls his hungry family in He grins, and bows a friendly bow So sorry, this my garden now. 1920 లో హర్వార్డ్ విశ్వవిద్యాలయానికెళ్ళినా ఎడాదికల్లా బయటకొచ్చేసాడు నాష్. తరువాతి కాలంలో పలు ఉద్యోగాలు చేసినా చివరగా బాల్టిమోర్ నగరంలో స్థిరపడి అక్కడే కొన్ని పత్రికలకి రచయితా తన జీవితాన్నంతా గడిపాడు. తనజీవితంలో ఎదురైన ప్రతి వస్తువుపైనా వ్యంగాస్త్రాలతో హాస్యాన్నిపండీంచాడు నాష్. క్రిమికీటకాదులనుంచీ, తన సహోద్యుగులనుంచీ, ఉద్యోగమిచ్చిన యజమానులపైనా తన కవితలని సంధిస్తూనే ఉన్నాడు. ఉదాహరణగా ఈగపై ఇతని వాక్యాలు చూడండీ: The Fly The Lord in His wisdom made the fly, And then forgot to tell us why. జీవితాంతమూ ఒకే సహచరి Frances Leonard తో ఉన్న నాష్ నిజంగా పెర్ఫెక్స్ట్ హజ్బెండ్. అందుకే భర్తలకి ఓ చిన్న సలహా ఇచ్చాడు ఇలా : One word to the husbands To keep your marriage brimming With love in the loving cup, Whenever you’re wrong, admit it; Whenever you’re right, shut up. జీవితాన్ని సుఖమయం చేసుకోవటం మనలో చాలామందికి అయితే తెలీదు లేదంటే ఇష్టంలేదనే చెప్పాలి. మానవజీవితమెలాగూ సమస్యల విషాదాల పుట్ట, దాన్ని మరింత దుర్భరం చేసుకుంటారు చాలామంది--అక్కడికేదో వాళ్ళు ఓ ఐదొందల ఏళ్ళు బతికేస్తారనుకుంటారో ఏమో!! నాష్ అలా ఎలా ఉండకూడదో చెప్పాడు తన వందలకొద్దీ కవితల్లో. చీమనుంచి బేస్ బాల్ బ్యాట్ దాకా ప్రతీ విషయాన్ని సరదాగా చూపించే ప్రయత్నంచేసాడు నాష్. అంటే మన జీవితం మనచేతుల్లోనూ చేతల్లోనూ ఉంది-- విషాదాన్నీ ప్రమాదాల్నీ ఎలాగూ ఆపలేం కనీసం హాస్యాన్నైనా నింపుకుందాం చేతనైనంత వరకూ..మరణాన్నీ ఇంత సరదాగా, హాస్యభరితంగా చెప్పొచ్చా....ఈ కవిత చూడండి Untitled Enter, breath; Breath, slip out; Blood, be channeled, And wind about. O, blessed breath and blood which strive To keep this body of mine alive! O gallant breath and blood Which choose To wage the battle They must lose. థాంక్స్ టు నాష్! (ఆశ: ఇక నుంచి మన కవిమిత్రులు వారానికొకటైనా హాస్యరస కవితని ఇచ్చే ప్రయత్నం చేస్తారని! ఓ మనిషి తను బ్రతికినంతకాలం అందర్నీ నవ్విస్తూ, తాను నవ్వుతు ఉండడమన్నది ఓ గొప్ప విజయం. అది నాష్ చేసాడు. అది మనందరం చేద్దామా? మనం మరణించే వరకూ అందర్నీ నవ్విద్దాం లేదంటే నవ్వించే వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. కనీసం వాళ్ళని బతకనిద్దాం, సరేనా?)

by Srinivas Vasudev



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ol6pCj

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి