పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, జూన్ 2014, శనివారం

Bandla Madhava Rao కవిత

విడివిడిగానే గూళ్లను వదిలి గుట్టల్ని వదిలి కొమ్మల మధ్య చిక్కుకున్న రెక్కల్ని పొదవుకుంటూ ఒక మహావృక్షం మీదనుంచీ వాలడానికి అనువైన మరో చెట్టు కోసం అన్వేషిస్తూ దశాబ్దాల ముందర మొదలైన ప్రయాణం ఉరకలెత్తే నీళ్ల మధ్య పుట్టినందుకు ప్రశ్నించడాన్ని ఎదిరించడాన్ని ముందే నేర్చుకొన్నందుకు ఎగరడమే నేరమైపోయిందివాళ నీళ్ల కొసం వలస పిడికెడు మెతుకుల కోసం వలస జాతి తరతరాల చరిత్రంతా పోరాటాలూ అన్వేషణలూ ఎక్కడెక్కడో ఎగరడాలూ వాలడాలూ ఎవరికీ ఏదీ సొంతం కానప్పుడు అంతా అందరిదీ అయినప్పుడు ఒకళ్లనొకళ్లం ఆలింగనం చేసుకొన్నాం రెక్కల కష్టాల్నీ కన్నీళ్లనీ పంచుకొన్నాం కొత్తగా ఇప్పుడే ఒకరొకొకరం తలక్రిందులుగా కనబడుతున్నాం సరిహద్దు రేఖల్ని గురించి సంవాదాలు మొదలువుతున్నాయి ఎదురైనవాళ్లను ప్రశ్నించిన మనం కలిసి నడిచొచ్చిన కాళ్లనే విరగ్గొడుతున్నాం చేతుల్లోని పువ్వుల్ని గుర్తించకుండా మందుపాతరల్ని అన్వేషిస్తున్నాం ఎప్పుడూ నేనే నీకు లక్ష్యమవ్వడమే నాకు మిగిలిన విషాదం చెరిపేసుకున్నా నిర్మించుకున్నా అటూ ఇటూ మనమే మెట్లు మెట్లుగా విడివడ్డ మనమీదనుంచీ నడిచెళ్లినవాడు సుఖంగా లక్ష్యాన్ని చేరుకొంటాడు లక్ష్యానికి అనంత దూరంలో నువ్వూ నేనూ ***

by Bandla Madhava Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SkiQ4P

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి