పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, జూన్ 2014, శనివారం

Kapila Ramkumar కవిత

దేవేంద్ర (ఖమ్మం) || తెగపడితే ( పోలవరం రణకవిత)|| అడివిని చెడగొట్టేది, చెరపట్టేది మైదానమే ! అడ్వివిస్వేచ్చా స్వచ్చతల తూనికరాయి రేలగా రూపాంతరం చెందిన పున్నమి రేయి! అక్కడ శ్రమకు తప్ప దోపిడికి వుండదు తావు ! కలిమి లేములు - కావడికుండలు అక్కడ లేవు ! దచుకోటం ఎందుకో తెలియదు అక్కడ ఆకలి నిద్ర సావాసం తప్ప వేరే కల్మషాల పడగ నిషిద్ధమక్కడ ! నచ్చినోణ్ణి ఎంచుకున్న నచకుంటే వదిలేసినా అది వ్యక్తిత్వ ప్రతీక తప్ప ఆధిపత్య అహంకారాలు కావు కష్టం - సుఖం అక్కడ వ్యక్తిగతం అంటే నేరం సమిష్టితనం చేదోడు వాదోడు తోనే వారి సహజీవనం అందుకే అడివి అంటే కొండా కోనా - వాగూ వంక చెట్టూ పుట్ట మాత్రమే కాదు మనిషితనం ఆనవాళ్ళ చేవ్రాలు ప్రేపంచంలో ఎక్కడా ప్రత్యేకంగా సృష్టించలేనిదే అడివి కాంక్రీట్‌ జంగిల్‌లో డబ్బులకై వెంపర్లాడే రోబోట్‌లకు అడివి ఒక అంగారక ప్రయాణం మీ వల్ల కాక మా అడివిని నీళ్ళకై ఆక్రమించుకూంటారా ? ఖబడ్దార్ ! మా కోసం పునరావాసం వద్దు మైదాన సావాసం వద్దు మీ పంఅభక్ష్య పరమాన్నాల వంటకు మా ప్రాణాలను మంటగా చేయకండి అడివి జోలికి రాకండి అలుగులుకు ఎరకాకండి ------------------ జీవన్మరణం సంకలనం - ఫిబ్రవరి 2006 - సాహితీ స్రవంతి ఖమ్మం _______________ 7.06.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k5i02B

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి