పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, జూన్ 2014, శనివారం

Kapila Ramkumar కవిత

గిరిజన బాలిక ఎగరేసిన పతాకం \\ డా||కత్తి పద్మారావు \\ Posted on: Fri 06 Jun 23:29:38.346852 2014 (ప్రజాశక్తి - ప్రజావాణి శీర్షిక)) వేద మంత్రాలతో అధికార పీఠాలు అవరోహిస్తున్నారు. వారిలో అభద్రత ఉంది. తిధి, వారాలు చూసి ప్రమాణాలు చేస్తున్నారు. అవును! ఆర్యావర్తంలో దళిత స్త్రీలు అత్యాచారం చేయబడి చంపబడుతున్నారు. అత్యాచారం కండగలవాడి సొత్తని తేలింది. రాజ్యం వీర భోజ్యంగా విరాజిల్లుతోంది. రక్తసిక్తమైన హస్తాలే రాజ ముద్రికలు ధరిస్తున్నాయి. అనంతమైన అడవులు, కొండలు, లోయలు కుదువ పెట్టే చర్యలకే సంస్కరణ అని పేరు ఆ! నెమలి నొకసారి చూడండి ఆకాశం ఉరమగానే పింఛం విప్పి నృత్యం చేస్తుంది. అవును! అతడు నగరాలు నిర్మించడమంటే మల్టీప్లెక్స్‌ బిల్డింగులు కడతాం అనుకుంటున్నాడు. నగరం అంటే జీవన సౌరభాలు వెదజల్లే ఉత్పత్తి కేంద్రం కావాలని అతనికి తెలియదు. పాపం అతడు ఉష్ట్ర పక్షి! అబద్ధం పలికితే సింహాసనం వచ్చింది. రోజూ ఆ అనృతానికే వన్నెలు చెక్కుతున్నాడు ఊహా సౌధాల్లో జనం ఊయలలు ఊగుతున్నారు. ఆ పక్షి ఆకాశంలో ఎంతో ఎత్తుకు ఎగిరినా మళ్ళీ నీటి చరియలపై వాలి దాహం తీర్చుకోవాల్సిందే! అవును! రాజ్యదరహాసాలన్నీ ముగింపబడేవి. ఆ పక్షి మళ్ళీ ఆ మబ్బు తునకల మీదే ప్రయాణం. - డాక్టర్‌ కత్తి పద్మారావు

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kLML1l

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి