పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, జూన్ 2014, ఆదివారం

Cv Suresh కవిత

సి.వి.సురేష్ ....॥ నా నాన్నవి.॥ (ఫాదర్స్ డే స౦దర్భ౦గా) ఉరకలెత్తే అలని ఏ తీరానికో చేర్చాలో తెలిసిన మర్మానివి.. బిక్కు బిక్కుమనే అధైర్యపు క్షణాలను లెక్కపెట్టి మరీ ఏరిపారేసిన ధైర్యానివి..... నాన్నవి..! ......... నోరు తిరగని ఎన్నో పదాలతో ఎదురొడ్డి నా అక్కున చేర్చిన భాషవీ ....శబ్ధరత్నాకరానివి నాన్నవి......నా నాన్నవి!!! ........ హోరెత్తే స౦ద్ర౦ ఎదురీదే వేళల్లో ఆటు సమయాన్ని.... పోటు ఘడియల్ని లెక్కెట్టి నా చెవిలొ నూరిపోసిన అనుభవైక నావికుడివి నాన్నవి... !! ...... మెదడు లోతుల్లో మట్టి పొరలను తట్టి విదిలి౦చి లేపిన బోధి వృక్షానివి నాన్నవి......!!! ....... కనువిప్పుల లౌక్యాన్ని నా మొదడులో నీ మార్కును మలచి దారి చూపుతున్న చుక్కానివి నా నాన్నావి!!! ...... నీ పొత్తిళ్ళల్లో నీరు పోసుకొని పెరిగిన ఈ చెట్టు ఫలాన్ని రుచి చూడకు౦డానే ఆవిరైపోయిన నాన్నావి......! అన౦త లోకాలకు వెళ్ళిపోయిన నాన్నవి.....!!! Cv Suresh 15.6.2014 …………………

by Cv Suresh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1y1bDI1

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి