పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, జూన్ 2014, ఆదివారం

ఎం.నారాయణ శర్మ కవిత

వర్చస్వికవిత-బియాస్ ___________________________________ అభ్యుదయవాదం కవిత్వానికి అందించిన పరిభాషలో"కాలిక స్పృహ "ఒకటి.ఒక సాధారణమైన సాహిత్యభాషలో చెబితే తక్షణ స్పందన(immidiate Responce).సమకాలీన సామాజిక పరిస్థితుల గురించిసమగ్రమైన అవగాహనతో,ప్రేరణతో కవిత్వం రాయటం.విమర్శకుల అభిప్రాయం ప్రకారం "దిగంబర కవిత్వం"కూడా ఈ స్పృహని కొనసాగించింది.కొయ్యగుర్రం అలాంటిదే.నిజానికి తక్షణ స్పందనకు,కాలిక స్పృహకు ఒక వెంట్రుకవాసి వైరుధ్యముంది.కాలిక స్పృహలో ఒక శాశ్వత ప్రాతిపదిక ఉంటుంది.తక్షణ స్పందనలో అది అన్ని అంశాలలో సాధ్యం కాక పోవచ్చు. మానవీయ సంస్పర్శలేని కవిత్వాన్ని సామాజిక దృష్టితో అనుభవించలేం. కవిసంగమంలో సమకాలీన జరిగిన అనేక సంఘటనలకు స్పందించి,బాధ్యతగా రాస్తున్న సందర్భాలు కనిపిస్తాయి..ఆ క్రమంలో ఈ మధ్యన హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ప్రమాదంపట్ల కొన్ని మానవీయ స్పందనలు కవితలుగా రూపుదిద్దుకున్నాయి. డా.ఎన్.వి.ఎన్.చారి.-"పాపం పసివారు",ప్రణయ్ -"దారుణం","ఎలా చెప్పనురా నువ్విక రావని " శారద శివపురపు,వర్చస్వి-"బియాస్"అరుణ నారదభట్ల "కాలం"-మొదలైనవన్నీ ఈ క్రమంలోనివే. సంజీవదేవ్"Transformation of impresion into expression is Art"అన్నారు.మనసులో ముద్రింపబడిన స్థాయి కవిత్వాన్ని పాఠకుడి హృదయానికి చేర్చుతుంది.వర్చస్వి "బియాస్" ఒక ప్రమాద వాతావరణం నుంచి గత,వర్తమాన ,భవిష్యకాలాలలోని యాంత్రిక స్పందనలను కవిత్వం చేసారు..ఒక నిశ్చేష్టమైన రస స్థితి ఇందులో కనిపిస్తుంది.అనేక వాక్యాలలో ఒక నిర్వేదం ధ్వనిస్తుంది.అచేతనమౌతున్న మానవీయతని పరోక్షంగ తిరస్కరిస్తున్న వాక్యాలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ కవిత్వీకరణాంశాన్ని కూడా మాట్లాడుకోవాలి మొదటి రెండు యూనిట్లు మనకు విషయాన్నిపరిచయం చేసి,అందులో నిష్పన్నం చేస్తాయి. "అప్పుడప్పుడూ స్వప్నాల రెప్పల మధ్య ఓ హరివిల్లుని చూసొద్దామనుకునే ఉల్లాసపు వెల్లువకు ఏదో తెలీని తప్పిదపు ఆనకట్ట అడ్డుపడిపోతుంది! చూస్తుండగానే కంటిలో చలమలు చిన్నగా చిలవలు పలవలై విరుచుకు పడ్డ వరదై కనీళ్ళ చితిని పేరుస్తుంది." అంశాన్ని పరిచయమంచేయడం దగ్గరినించి వర్చస్వి సాధించిన భారత(baalence)గమనించ దగ్గది.రెండవ వాక్యంలో మనసు ధ్:ఖ భరిత మయ్యే భాగాన్ని అంచలంచలుగా చెప్పడం కనిపిస్తుంది.మూడవ వాక్యం నించి మనిషిలోని యాంత్రిక స్పందనలను కవిత్వం చేస్తారు. " కోల్పోయిన లేత కలల్ని వొత్తులేసుకుని వెతికీ వెతికీ వేసారిన కళ్ళు- నివాళిగా వెలిగే కొవ్వొత్తులవుతాయి ! రోజులు దొర్లాక దొర్లిపడ్డ కన్నీటి కెరటాలన్నీ చుక్కలు చుక్కలుగా కాసింత కుదుట పడిపోతుంటాయి. పగిలిపోగా మిగిలిన గుండెల్ని స్మృతులుగా శృతిచేసుకుని జాలిగా నేమరేసుకుంటాయి ! ఎప్పటిలా దీటైన యంత్రాంగం తనపని తాను చేసుకు పోతూ ఎక్కడో మేటవేసిన ఇసుకలో ఇంకి పోతుంది! కుర్రకారుతో పోటీపడి ‘అశ్రద్దా-అప్రమత్తతలు’ పొగరైన వైట్ కాలర్ల నేరాలుగా ఎగురుతాయి. ‘సౌందర్యాన్ని వీక్షించదలచిన కన్ను చిన్న నలుసైనా పడకుండా రక్షించుకోవడం నేర్వాలనే’ అంశం- రేపటి స్కూలు సిలబస్ లో ‘బియాస్’ పాఠంగా వెలిసి తప్పించుకుంటుంది! "నిజానికి ఇందులో చెప్పిన అంశాలన్నీ ఒక అంశాత్మక పరిశీలన(Case Study) గా కనిపిస్తాయి.సాధారణ జనం,సంబంధీకులు,రాజకీయనాయకులు,మేథో వర్గం వీరందరూ పరోక్షంగా వరుసగా ఈ వాక్యాలనుండి వ్యక్త మౌతారు. కాలికంగా అవసరమైన జగరుకతని ప్రదర్శించడమే కాకుండా,తగిన భారత కలిగిన హృదయ స్పందనని,సామాజిక దృష్టిని వర్చస్విగారి కవిత వ్యక్తం చేస్తుంది.సామాజిక స్థితిగతుల్ని సమకాలికంగా అంచనా వేయనప్పుడు స్పందించనప్పుడు కవిత్వ వస్తువులో,దృష్టిలో,కవిత్వీకరణలో మూస తొంగి చూస్తుంది.దీన్నించి మరల్చుకుని కవిఎలా ప్రవర్తించాలో ఈ కవిత గుర్తుకు చేస్తుంది.

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pZ5asz

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి