పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, మే 2014, సోమవారం

Swatee Sripada కవిత

1 ఎలా నడిచి వచ్చానో మరి నన్ను నేను చిటికెన వేలట్టుకు నడిపించుకుంటూ దుఃఖాలు వడబోస్తున్న చీకటి కనుపాపల మినుకు మినుకు వెలుగుల్లో తడబాటు అలలై చుట్టేసే తమకాలను వదిలించుకు సైకత స్వప్నాల హోరు గాలిలో తమాయించుకుంటూ ఎలా నడిచి వచ్చానో మరి ! కరిగి కరిగి నీరై ప్రవహిస్తూ, నిలువరించుకుంటూ రెపరెపల మధ్య పూరెక్కల పరవశాల పులకరింతల మధ్య కంటి రెప్పలకింద వికసించకుండానే వాడిపోయిన కసరు క్షణాలూ లోలోపల పొరల మధ్య అలసి అలసి కుప్ప కూలిన భావాలను పేర్చుకుంటూ, ఓదార్చుకుంటూ, సవరించుకుంటూ మైనపు ముద్దలా మరుగుతూ , చల్లారుతూ కాస్త కాస్త కాలం నీడల్లోకి నిశ్సబ్దంగా అదృశ్యమవుతూ ఎంత మిగిలి వచ్చానో ....... 2. ఇప్పుడిక రంగూ రుచీ వాసనా కోల్పోయి నిస్తేజంగా గుడ్లప్పగించి చూస్తున్న శీతాకాలపు సాయంసంధ్య నై ఉపరితలం పొడుగునా మౌనం గాజు అద్దాలు పరచుకు పలకరి౦తల వెచ్చని వెలుగు కిరణాలు వెనక్కి తిప్పి కొడుతూ లోలోపల నాకు నేనే ఒక ఆవిష్కరి౦చని ప్రపంచాన్నై’’ ౩. ఈ కొనకూ ఆ కోనకూ ఆద్యంతాలకు ముడివేసిన ఉలిపిరి సిల్కు దారపు వంతెన మీద వెనక్కు తిరిగి చూసుకుంటే నడిచొచ్చిన అడుగులకూ ముందు నడవవలసిన దూరానికీ ఒకటే కొలమానం వెనక్కు నడిచినా ,ముందుకు కదిలినా దూరం ఒకటే అయినప్పుడు ఎలా నడిచి వెళ్ళాలో చివరి అడుగు వరకూ

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nWD4PP

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి