పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, మే 2014, సోమవారం

Poornima Siri కవిత

పూర్ణిమా సిరి !! ప్రణయ గీతి..పయన రీతి !! అనుకోకుండా చేరువైనరోజుల్లో సరస్సులో నీటి నై పేరుకున్న పాచిలో కూడా కలువగా వికసించాను ఉండీ ఉండని గడియల్లో నదిలా ప్రవహించడం నేర్చుకున్నా నా ఆలోచనల గడపనొదిలి నీ అవగాహన ముంగిలిలో తిరుగాడాను నడిచే నదికి వీచే గాలికి సుస్థిరత ఏదని సాంత్వన తో సరాగాలు పాడాను నువ్వోక్కోఅడుగు దూరం వేసినప్పుడు ఉప్పు సంద్రాన్ని ఘనీభవించమని శాసించాను నువ్వూ నేను ప్రపంచానికి అతీతులం కాదని అంతటా మనమే కదలాడామని అంగీకరించాను నిజమే కదా వేడెక్కుతున్న నీళ్ళు అడుగునుండీ ఉష్ణాన్ని పైకి ఎగదోస్తాయి ఘనీభవిస్తున్న నీళ్ళు పైనుండి లోనికి గడ్డ కడుతాయి పలకరింపుతో మొదలయిన పయనం ప్రణయంగా హృదిని తాకినట్టు నిర్లిప్తతతో నిర్లక్ష్య మౌన రణం మెల్లిగా మది మరణంతో ముగిసినట్టు.... 5.5.14

by Poornima Siri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q6Iqdl

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి