పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, మే 2014, సోమవారం

Sriarunam Rao కవిత

"భారత రాజ్యాంగం అతుకులబొంత" అంటూ గాన్ విల్ ఆస్టిన్ భారతరాజ్యాంగాన్ని నిర్వచించాడని చదివినప్పుడు నేనెంతో బాధపడేవాడిని. దానికితోడుగా నెహ్రూ, ఆజాద్, పటేల్, అంబేద్కర్ వంటివారి నియంత్రణలో సాగిన మండలిగా కూడా ఆయన వర్ణిoచాడు దాన్ని. కానీ రాజ్యాంగం మనకు చెప్పిందీ, మనం దాన్ని అడ్డుగా పెట్టుకుని చేస్తున్నదానికి మద్యనున్న తేడాని చూస్తుంటే... ఆయన నిర్వచనాలే నిజమనిపిస్తుంటాయి అప్పుడప్పుడూ. దేశాన్ని సమూలనంగా మార్చగలిగే అవకాశం మనకు రాజ్యాంగం వలన లభించివుండొచ్చు. కానీ మరలా దాన్నీ..... దేశంలో వున్న "అన్నిటికీ" వ్రేలాడుతూ బ్రతుకీడ్చేచేలా చేశారేమో అనిపిస్తుంది ఇప్పటి దుస్థితి చూస్తుంటే. మనకు ఒక ఇల్లు కట్టే అవసరం ఏర్పడింది. దానికొరకు మనముందు కొత్త ఇటుకలూ, సిమెంట్ ఇంకా కావలిసినవన్నీ సమకూర్చుకునే అవకాశం కూడా వుంచబడింది. వాటితోపాటూ అంతకు ముందే కూల్చివేయబడిన పాత ఇంటి అవశేషాలూ ఆ పక్కగా వున్నాయి "మనం ఏం చెయ్యాలనుకుంటాం?" నూతనంగా కట్టే ఆ ఇంటిని అన్నీ నూతనాలే వాడి మరింత బలంగా కొత్తగా రూపొందించాలనుకుంటామా? లేక... పాతవి ఎలాగూ మిగిలిపోయాయిగా అనుకుంటూ ఆ అవశేషాలనీ కలిపి కడతామా? లేక... ఇవేమీకాదులే ఆ కట్టడం ప్రారంభిస్తూ మద్యలో మనకు ఏవి దొరికితే వాటితో కట్టేసుకుపోదామనుకుంటామా??? ఈ మూడింటిలో మీరైతే ఎలా కట్టాలనుకుంటారో అదే మీ కట్టడపు భవిష్యత్తు కదా. దాన్ని ముందు నమ్మండి. తరువాత మీకే కనుక రాజ్యాంగం రాసే అవకాశం వస్తే ఏది కోరుకుంటారో నిర్ణయించుకుని నిజాన్ని తెలుసుకోండి. ఇవి రెండూ మీరు మనస్ఫుర్తిగా ఆవాహాన చేసుకోగలిగితే రేపటి ఎన్నికల కోసం మిమ్మల్ని మీరు సంపూర్ణంగా బ్రతికించుకున్నట్లే. ప్రయత్నించిచూడండి. త్వరలో విడుదల కానున్న నా రచన "నా భారతీయం" నుండి శ్రీఅరుణం 9885779207

by Sriarunam Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ju9iP6

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి