పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, ఏప్రిల్ 2014, బుధవారం

Wilson Rao Kommavarapu కవిత

జీవన లిపి // 30.04.2014//కె.విల్సన్ రావు -------------------------------- ఆశల్నొదులుకుని ఆశయాల్ని భుజనేసుకున్నామని నమ్మబలుకుతూ పసిగట్టలేనంతగా మన సజీవ దెహాల్లోని ఒక్కొక్క అంగాన్నీ కత్తిరించి బతుకుల్ని అంధకారంలో తోసే అరాచకీయులు మన జీవితాల్ని బాగు చేస్తామని వాగ్దానాలు చేస్తుంటే నమ్ముదామా..? నయవంచకులు నయా వంచకులై మన దేహ నదుల్లో జలకాలాడాలని చూస్తున్నారు- నిరంతరం మన మెదడును చెంచాలు చెంచాలుగా నంజుకు తినడమే అజండాగా అన్ని రకాల జెండాల్ని మార్చి మార్చి మోస్తూ ధన నిషాలో సుఖాల్ని అనుభవించే గండు చీమలకు " నో టా " చెబుదాం! మన కస్టాల్నీ, కన్నీళ్ళనీ గుర్తెరిగి దు:ఖ మూలాల్ని తెలుసుకుని తనని తాను దానం చేసుకుంటూ మనిషి పాదముద్రల్ని కాంతిమయం చేస్తూ ప్రయాణిస్తున్న రాటుదేలిన ఆలోచనాపరుడ్ని నమ్ముదాం... మనకోసం గంధం చెక్కలా అరిగిపోతూ చైతన్యపు గొడుగును తలపై నాటుకుని జనవాహినిలోకి ప్రవహిస్తున్న వివేచన జెండా ఆసరాతో.. మనకు మనం అసహనపు ముసురులోంచి విముక్తులమై జీవన సత్యాలను విప్పి చెప్పే పరాధీనతకు లొంగని మానవాయుధాలమవుదాం. సజీవ అలంబనైన మనసున్న ఆత్మ విశ్వాసిని ఎన్నుకుని ఒక వినూత్న జీవన పరిమళ సూర్యోదయాన్ని కలగందాం...

by Wilson Rao Kommavarapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n0Glej

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి