పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, ఏప్రిల్ 2014, బుధవారం

Sriramoju Haragopal కవిత

కవి ఏమున్నది శ్రీశ్రీ మనకు గర్వ కారణం? ఎప్పటిలెక్కనె ఎలక్షన్లు దారుణం అందరు సిధ్దాంతులే ప్రజాధనం గాయబ్ అందరు మననేతలే మహాకవీ సాయెబ్ తిట్లడానికి తిట్లు నిషేధింపబడ్డయి గాని పెట్టుడు మీసాలకు సంపెంగనూనె శాని అలవోకగ వాగ్దానాలు వడగండ్ల వానలు వాణ్ణి వీడు వీణ్ణి వాడు తెగ తెగిడే జాణలు వూకుంటె మహాప్రస్థానమె రాసేస్తరు వూకొడితే చందమామకథ చెపుతరు రాజకీయ గుంజులాట రంకురాట్నమయ్యింది కప్పలతక్కెడ నేతల కామన్ ఎజెండయింది మరోప్రపంచం ఒకటి నేల మీదికొచ్చునా ఆకలి దుఃఖంలేని రాజ్యమనేదుండునా ఎందుకయ్య ఆశపెట్టి పద పదమన్నావు ఏదో మార్పు వొస్తుందని స్వప్నమొక్కటిచ్చావు రేపటివెలుగులకొరకు ప్రాణమిచ్చు రణంబాట తిరుగుబాటులన్నీ జరుగుబాటు కొరకేనట తుపాకీల మొనలనుండి జారుడుబండాట ఎటుపోయెనొ మనలో మానవత్వమన్నమాట ఎప్పటాటె పేదలకు ఎండినవే చిప్పలు తప్పదీస్తె ఈ నేతల తప్పునేమొ తిప్పలు ఏమున్నది ఏమున్నది ఏమున్నది మిగిలి? రానున్నద రానున్నద కొత్తపొద్దు రగిలి

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rG9Yl2

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి