పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, ఏప్రిల్ 2014, బుధవారం

Pusyami Sagar కవిత

సొన్నాయిల నరేష్కుమార్ రాసిన కవిత //ఊరుపేరెంది మరి//కవిత్వ విశ్లేషణ _______పుష్యమి సాగర్... పల్లె నుంచి పట్నం పోయిన వలస బతుకుల చిత్రమే నరేష్ కుమార్ గారు రాసిన కవిత !!ఉరు పేరేంది మరి !!...చాల చక్కని మాండలికం లో రాసిన ప్రతి అక్షరం బతుకు చిత్రమే..అందరు దైనందిన జీవితం లో ఉరుకులు పరుగులతో సాగుతూనే వుంటారు ఎంత యాంత్రికమైన కూడా ...ఇక్కడ పల్లె నుంచి పట్నం వచ్చిన వ్యక్తుల ఆలోచన, వారి లో వుండే వ్యధ, అంతరంగ వ్యక్తీకరణ కన్పిస్తుంది ...మేము ఎలా ఉన్నామో చూడండి అంటూ ఇలా అంటారు ఇంట్లకేంచి ఆఫీస్కూ//ఆఫీస్ల ఖుదాహఫీజుల్జెప్పి ఇంట్లకూ...//"బైంగన్ కా జిందగీ" అనుకుంటనే బేషరం గాల్ల లెక్క//బజార్లపొంట నడుస్తనే ఉంటం ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టి అందులో మమేకం అయినపుడు తన పాత రోజులులను తలచుకొని బాధ పడుతున్నాడు ...పల్లె నుంచి పట్నం వచ్చిన వలసవాది మరి పొద్దున నుంచి సాయంత్రం దాక ప్రపంచాన్ని చుట్టి వచ్చిన సూరుడు పొద్దు పొడిచే వరకు అంత వేగం గా ఎలా సాగుతుంది ...ఇదే ఆలోచన నుంచి అన్నం తినడం కూడా మర్చిపోతాం .. మల్ల ఎర్రవడి వొర్రెల దుంకుతడు//గ్రాండ్గ బతుకుతున్నం అనుకుంటనే రావొత్తు ఏన్నో పారేస్కొని//పల్లెం ల మారన్నం బెట్టుకునుడు పల్లె నుంచి కడుపు నింపు కోవటాని కి పట్నం వచ్చినపుడు మరల అదే పల్లె భాష కాని, వారి అలవాట్లు ...మాట కాని పలకరిస్తే.....మనసు కొట్టుకుంటుంది ఒకసారి అన్నా నా పల్లె ను చూడాలి ..అక్కడ నేను కోల్పోయిన ప్రతి ఒక్కటి ని ముద్దాడాలని ఉంది ...ఒక జానపద గాయకుడి పాట కన్న ఊరు కి రప్పించే శక్తి ఉన్నదీ అంటే ...గొప్ప పాట దా ...లేక పాట రాసేలా ప్రేరేపించిన ఊరుదా ...ఏమో!!!! ...తను తిరిగిన వీధులను ...గుర్తు చేసుకుంటూ మొత్తం తిరగ మనసు అవుతుంది .....మల్ల ఎప్పుడు అయిన ఊరికి వెళ్తే ...అక్కడ తన పల్లెతనం కాకుండా కొత్త గా ...పట్నం మొహం కన్పిస్తుంది ...????!!! నిజమే ...పల్లె నగరీకరణ అయినపుడు అంతే కదా.,... ఎప్పుడన్న ఓసారి //రేడియల కెల్లి గొరటెంకన్న వొర్లినప్పుడు//యాదికచ్చిన ఊరు కండ్లల్లకెల్లి కార్కత్తది.../గల్లిలల్ల గాయి గాయి తిర్గబుద్దైతది పల్లె పట్నపు మొకమేస్కొని//గడంచెలగూసోని//నవ్వుతాంటది... తన ఆత్మ పల్లెటూర్లో నే వదిలేసి యంత్రకత ను నింపుకొని సాగుతున్న పట్నం బతుకును తలుచుకొని విచారిస్తున్నప్పుడు తన పల్లె తమ్ముడు మారిన తన పల్లె కి ఏమి పేరు పెడదాం అన్నప్పుడు నిజంగా పల్లె మనసు ఎంత గా క్షోబించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ... మాడుప్మొకమేస్కొని//మంచాల గుసుంటే//కడుపుల కత్తివెట్టినట్టు తమ్ముడచ్చి అడుగుతడు//"అన్నా మనూరికి కొత్త పేరేం బెడ్దామే" అని మొత్తానికి నరేష్ గారు పట్నం మింగేసిన పల్లె ని మరోసారి చిత్రం పై కి తీసుకు వచ్చారు తన కవిత ద్వారా., ...వారి కవితలేప్పుడు కూడా సామాజిక అంశాల ను తడుముతూ ..ముందుకు సాగుతుంది ..కాకపోతే అచ్చమైన తెలంగాణా మాండలికం లో ఉన్నదు వలన కొన్ని అర్థం కానివి వుండి ఉండొచ్చు ఉదాహరణ కు "సిల్పర్లతోటి" , "సైబాత్ సమజైనట్టు"మనకతం "గాయి గాయి! వంటి కొత్త పదాలు అర్థం చేసుకోవడం ..ముఖ్యం గా తెలంగాణా మాండలిక ము తో పరిచయం లేని వాళ్ళకి కొత్త గానే అనిపిస్తుంది ..కొన్ని వాటికి వివరణ ఇచ్చి ఉంటె బాగుండేది ...అది మరింత చేరువ గా వెళ్ళేది పాటకుడి మనసు లో కి ..మంచి కవిత ని అందించిన నరేష్ కుమార్ గారికి వందనాలు ... సెలవు ఏప్రిల్ 30, 2014 ----- సొన్నాయిల నరేష్కుమార్ //ఊరుపేరెంది మరి// ఉర్కుతనే ఉంటం అందరం ఇంట్లకేంచి ఆఫీస్కూ ఆఫీస్ల ఖుదాహఫీజుల్జెప్పి ఇంట్లకూ... "బైంగన్ కా జిందగీ" అనుకుంటనే బేషరం గాల్ల లెక్క బజార్లపొంట నడుస్తనే ఉంటం ఏదో పీకుదాం అని తెల్లవడ్డ సూర్యుడు పొద్దూకంగ సైబాత్ సమజైనట్టు మల్ల ఎర్రవడి వొర్రెల దుంకుతడు మనకతం గాదు గ్రాండ్గ బతుకుతున్నం అనుకుంటనే రావొత్తు ఏన్నో పారేస్కొని పల్లెం ల మారన్నం బెట్టుకునుడు మర్శిపోతం. ఎప్పుడన్న ఓసారి రేడియల కెల్లి గొరటెంకన్న వొర్లినప్పుడు యాదికచ్చిన ఊరు కండ్లల్లకెల్లి కార్కత్తది... ఊల్లెకు వొయ్ సిల్పర్లతోటి గల్లిలల్ల గాయి గాయి తిర్గబుద్దైతది సికింద్రవాద్ల తలుపుదీశి ఊర్కడుగువెడ్తే పల్లె పట్నపు మొకమేస్కొని గడంచెలగూసోని నవ్వుతాంటది... మాడుప్మొకమేస్కొని మంచాల గుసుంటే సర్వపిండి ని పిజ్జా లెక్క కొరుక్కుంట పక్కపొంటి కూసోని కడుపుల కత్తివెట్టినట్టు తమ్ముడచ్చి అడుగుతడు "అన్నా మనూరికి కొత్త పేరేం బెడ్దామే" అని

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pKXRHG

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి