పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, ఏప్రిల్ 2014, బుధవారం

యాకయ్య వైట్ల కవిత

శ్రీరంగం శ్రీనివాస రావు (శ్రీశ్రీ) జన్మదిన సందర్భముగా నా ఈ కవిత IIమనుషులం... మేము మనుషులం..? II ---- యాకయ్య . వైట్ల మనుషులం... మేము మనుషులం మానవత్వం చూస్తే మాకు మూర్చరోగం. మంచి మనిషిని చూస్తే మాకు వాడిది పిచ్చిలోకం. నిప్పు కణికలు సృష్టించే రాతి బండలు కరిగించే నీటి కొండలు చేదించే నేల విడిచి నింగి సాముచేసినా నీతి మాత్రం నాటిదే ఊసరవెల్లి మా ఆప్తుడే. ధైర్యం లేని బ్రతుకులు... దెయ్యంలా నతుకులు కుక్కలా గతుకుడు ... "బొక్క"ల కై వెతుకుడు ఛీ... ఛీ... చిపురుకున్న మురికి మేము... ఈ నేలకి పట్టిన చీడ మేము. కాశాయానికి కాళ్ళు పడుతాం, సువార్తల కి హరులమవుతాం, నడి వీధిన గొంతెత్తి గోరీలు కడతాం. మరణించే క్షణమునైనా, ఈ మనిషికి తెలిసేనా...? "మనిషి" మాత్రమే దేవుడవుతాడని. "ఆది"... "అమ్మా "... అంటూ ఇంట్లో ఆరాధనా. "నీ"... అమ్మ... "ధీ"నమ్మా... "వీ"డమ్మా... అంటూ వీధిలో స్తోత్రం. భరత మాత బిడ్డలం మేము... బరితెగించిన గోడ్డులం మేము. ప్రేమా... పొంగూ... అంతా పైమాటే "పైకం" ఆపిచూడు నీ ప్రాణం ఎవరో... నీ గానమేవరో తెలిసే. నింగి చివరన... ఆ నేల అంచున అంతా కలిసినట్టే మా మనుషులంతా... అంటి ముట్టనట్టే. పాశానికి ప్రాణం ఇస్తాం విషానికి వెన్ను విరుస్తాం ఆపదలకి హస్తమిస్తాం ఆకలిగొన్న చూపుకి ఆవిరవుతాం, రోషానికి రొమ్ము చూపుతాం రొక్కం ఇస్తే చక్కగా ఈ చిక్కులని చలిమంటకాస్తం. మహానీయులమైనా..... మహనీచులమైనా.... మనుషులం... మేము మనుషులం మానవత్వం చూస్తే మాకు మూర్చరోగం. మంచి మనిషిని చూస్తే మాకు, వాడిది పిచ్చిలోకం. Dt. 20/12/13

by యాకయ్య వైట్ల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jg5zEC

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి