పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, ఏప్రిల్ 2014, బుధవారం

Venugopal Rao కవిత

నా పిచ్చిగానీ నాకెప్పుడు న్యాయం జరిగిందని మా అమ్మలను అమ్ముమ్మలను దాసీలుగా చెరబట్టి దొరసానులకు సేవచేయించి దొరల కోర్కెలు తీర్చుకుంటే నా పెద్దయ్యలు కళ్ళు మూసుకున్నారే తప్ప తిరగబడలేదు వాళ్లకు ముందే తెలుసేమో తిరగబడితే ఒరిగేదేమీ లేదని స్వతంత్ర దేశాన దళితులకు రక్షనంటే నిజమేననుకున్న నా అక్కచెల్లెల్ల అంగాంగాలను వర్ణిస్తుంటే తాకరాని చోట చేతులేసి గేలి చేస్తుంటే చుండూరు చైతన్య్హం తిరగబడింది ఆడోల్లపై దౌర్జన్యం ఏంటని ప్రశ్నించింది కామంతో తెరుచుకున్న కళ్ళు ఎరుపెక్కాయి అగ్రవర్ణ దురహంకారం బుసలు కొట్టింది ధనబలంతో మదమెక్కిన కండకావరం వెంటపడి దాడి చేసింది నా చైతన్య్హం పై ప్రశ్నించిన నా దళితుని కంఠన్ని నరికేసింది న్యాయం అడిగిన నేరానికి నా తమ్ముడు చుండూరు చేలల్లో శవమయ్యాడు నావాళ్ళ రక్తం చూసి రాత్రి తెరమరుగయ్యింది తెల్లారంగనే అంతా షరా మామూలే మాకు మళ్ళీ న్యాయం చేస్తామని పెద్దల హామీలు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి దుండగులకు దండగేస్తామన్నారు అయినా మా పద్మారావు పిచ్చిగానీ దళితుని కత్తికి ఈ రాజ్యంలో పదును ఎక్కడ ఉంటది లక్షల విలువ చేసే నల్సార్ యూనివర్సిటీ లా డిగ్రీ బతుకు లేని బీదోల్ల పక్కన ఎందుకు ఉంటది ఇరవై ఏళ్ళ కాలంలో నిజాన్ని నిర్ధారణ చేయలేదని నా తమ్మున్ని ఎవరూ విగాతజీవుడ్ని చెయ్యలేదంటారు ఏం చేస్తాం ఏం జరిగినా చూస్తూ ఊరుకోవాలి కత్తి తిప్పటం మాని కళ్ళు మూసుకోవాలి మన అయ్యలే నయం న్యాయం జరగదని ముందే మేలుకొన్నారు, మనకోసం కొంతకాలం బతికారు మనరాజ్యం వచ్చేదాక అంతే మరి

by Venugopal Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iKxk8c

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి