పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, ఏప్రిల్ 2014, బుధవారం

Sriramoju Haragopal కవిత

జిందగీ దేనెవాలే... నడుస్తున్నపుడు నా పాదాలను మోస్తున్నదెవరు నా నడకకు బాటలు తీస్తున్నదెవరు మేఘాల రుమాళ్ళు చుట్టి ఆకాశాన్నితోడు పయనం కట్టించి మెరుపుల ఇష్టసఖులను తోడుపంపి నాకన్నా ముందే దారిలో ఆశల చెలిమెలు నింపి చెట్లకు ప్రియమోహనాల సద్దులు కట్టి తానే దారంతా పూలదువ్వెనలెగురేస్తూ వాన చినుకులదుప్పటి కొప్పెర పెడుతున్నదెవరు అనంతమైన అనురాగాల రుతువేదికల చలివేంద్రాలు పెట్టి అలిసిపోని ఇష్టాల గాలికుచ్చుల వీవెనలు కట్టి పాదాలకింద చల్లటి మమతల కొండవాగుల్ని పరిచి గుండెగొడుగు పట్టిన చెట్లబాటలో తొవ్వలు తొక్కించి మజిలి మజిలీకి పాటలసత్రాలు కట్టించినదెవరు నువ్వేనని నాకు తెలుసు వెనక్కి తిరిగి నిన్ను చూడకుండా నా చూపుల నెత్తుకపోతున్నారెవరో నా మనసును చీల్చుకపోతున్నారెవరో సాగనంపిన నువ్వే ఎదురొచ్చేవేళకు నా వూపిరులాపివుంచు కాటుక కరిగి జారిన కళ్ళల్లో నిలిపివుంచిన కొత్త కన్నీటి ముత్యాలమాల నీకే ఇవ్వాలని నా మనసుకు నేను మాటిచ్చా

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l2cCl0

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి