పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

Sasi Bala కవిత

మధుర క్షణాలు మళ్ళీ వస్తాయా ఆ మధుర క్షణాలు .......sasibala చేల గట్లపై పరుగులు తీస్తూ లేగ దూడతో పోటీ పడిన క్షణాలు .. కోడె దూడతో పోటీగా గోమాత పొదుగును చేరి తాగిన గుమ్మపాల కమ్మని రుచులు మళ్ళీ వస్తాయా ఆ మధుర క్షణాలు పండు వెన్నెల్లో ఒకే పళ్ళెం లో వెన్న ముద్దలూ ,పాల బువ్వలూతింటూ బామ్మ చెప్పేటి కమ్మని కథలను అన్నదమ్ములూ అక్క చెల్లెళ్ళు అందరు కలిసీ ఆస్వాదించిన ,ఆరగించిన ... ఆ మధుర క్షణాలు మళ్ళీ వస్తాయా పండుగంటే చవులు ఊరించు నవకాయ పిండి వంటలతో పంచ భక్ష్య పరమాన్న విందులు లొట్ట లేసుకుని లాగించిన ఆ మధుర క్షణాలు మళ్ళీ వస్తాయా వెన్న చిలికే మహారాణి.. అమ్మ కడకొంగున దూరి నేతి బూరేలకు,చిట్టి గారెలకు మారాం చేసిన .. మధుర క్షణాలు మళ్ళీ వస్తాయా ఆరు బైలలో ..పచ్చని చెట్ల నీడలో మదతమంచాల పాన్పులపై బడి , నింగి వీధిలో ఊరేగే తారా చంద్రుల ఊసులెన్నో మరి ఊహలెన్నో కథలు కథలుగా మననం చేసిన మధుర క్షణాలు మళ్ళీ వస్తాయా నడవను గూడా ఖాళీ లేని వింత జగతిలో పరుగుల బరిలో యంత్రాల లోకం లో ..డబ్బు మహా ప్రపంచంలో ప్రేమలు పోయి ..మమతలు పోయి ఆప్యాయతలకు సున్నం వేసి కనబడని మాయలో ..కొట్టుకుపోతూ ,కూరుకు పోతూ అమ్మనాన్న బంధాలన్నది లేక అన్నదమ్ములూ ,అక్క చెల్లెళ్ళ మమకారాలు కరువైన నరకం లో ఊపిరి(పోసే ???) తీసే విష వాయువులతో ఉక్కిరిబిక్కిరి అయ్యే శ్వాస నిశ్వాసల నడుమ దైవ నిర్ణయాల కతీతంగా .. మనిషి సృష్టించు మారణకాండల నడుమ బ్రతుకుతున్నామో ...చస్తున్నామో అర్థం కాని త్రిశంకు స్వర్గంలో ఉంటున్న ..మనుగడ సాగిస్తున్న మనం వున్నట్లా ..లేనట్లా మీరే చెప్పండి ..తీర్పును మీరే ఇవ్వండి గడచిన కాలం తిరిగి రాదు .. ఇక మానవ జీవితాన రావేనాటికీ ఆ మధుర క్షణాలు (11 april 14 )

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gfxJer

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి