పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

Padma Arpita కవిత

నాకు తెలిసినదేదో!! ఈ లోకంలో నటించనివారు ఎవరు?? లేనిది చూపే ప్రయత్నమే నటించడం ప్రేమించలేనివాడు ప్రేమని నటిస్తే నిజం చెప్పలేనివాడు అబధ్ధమాడతాడు! ఆకర్షించలేనివాడు అందాన్ని అరువడితే నిజాయితీలేనోడు అన్యాయాన్ని ఆశ్రయిస్తాడు! ఈ రంగులుమార్చే లోకంలో ఎవరికెవరు?? ఒకరి కోసం ఒకరని మోసగించుకోవడం స్వార్థమెరిగినవాడు ఇతరులని మోసగిస్తే అసూయాపరుడు ఆదర్శాలని వదిలేస్తాడు! తనవద్ద లేనిది ఇతరుల్లో చూసి కొందరేడిస్తే తత్వమెరుగనోడు తర్కించి గెలవాలనుకుంటాడు! ఈ జీవన రణరంగంలో చివరికి మిగిలేదెవరు?? తెలుకోవాలన్న ప్రయాసతో తోలుబొమ్మలై ఆడడం విజయాన్ని కోరువాడు విశ్వప్రయత్నంతో గెలిస్తే దొంగలా దోచుకునేవాడు దొడ్డిదారిలో పరుగిడతాడు! కౄరత్వంతో కఠినంగా మసలువాడు మృగంలా జీవిస్తే మంచిమనుగడ కలవాడు అందరి మదిలో జీవిస్తాడు! 11th April 2014

by Padma Arpita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kd1Bgd

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి