పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, మార్చి 2014, సోమవారం

Viswanath Goud కవిత

చీకటి భాణాలు ఆకాశంలో కొన్ని చుక్కలు పరిగెడుతుంటాయి ఎవరో తరుముతున్నట్టు, ఏ ఆపన్నహస్తమో అందుకోవాలన్నట్టు... చీకటి తరిమితే వెన్నెల పంచన చేరాలనుకుంటున్నాయి కాబోలు... వెన్నెలను వెంటాడుతూ చీకటిమంట వ్యాపిస్తోందని, నల్లగా కాల్చి రాత్రులకు కాటుక దిద్దబోతోందని.. చీకటి భాణాలు సంధిస్తుంటుంది అమాసని.. వెన్నెలను పడగొట్టాలని వెలుగుల నుండి విడగొట్టాలని... పక్షానికో మారు యుద్ధం ప్రకటిస్తుందని. తాము రాత్రి గుమ్మానికి కట్టిన రాలిపోయే తారాతోరణాలయితే.... వెన్నెల ఆకాశానికి దిష్టి తీసి పెట్టిన కరిగిపోయే కర్పూరమని. ఆకాశపు కొలనులో అమావాస్య అలజడికి చెదిరిపోయే ప్రతిభింబమని.... చెదిరిన ప్రతీసారీ... గడ్డకట్టి పగిలిపోయిన మంచు ముక్కలుగా కరిగి కనుమరుగవుతుందని... తెలియదేమో వాటికి. తెలిసుంటే రావు చుక్కలు వెన్నెలను ఆశ్రయించి..ఏదో ఆశించి. ఎవరు చెప్పారు చుక్కలకు పరిగెడితే పారిపోవచ్చని.. చీకటి నుండి తప్పించుకున్నా పగలుకు తప్పక పట్టుబడి రాత్రిలో బంధీ కాక తప్పదని, ఇదో చక్రవ్యూహమని ఎవరైనా చెప్పాలి వాటికి.! -విశ్వనాథ్ 31MAR14

by Viswanath Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iRlRTo

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి