పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, మార్చి 2014, సోమవారం

Kks Kiran కవిత

ఈమధ్య శ్రీ కృష్ణదేవరాయలు రాసిన "ఆముక్తమాల్యద " చదివాను,,అందులో రాయల వారు అన్ని ఋతువులను అద్భుతంగా వర్ణిస్తాడు, అందులో వసంత ఋతువు వర్ణన చూడండి. విరహ తాపం ఎక్కువైందని ,దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి చేరటం తో వసంతం ఆరంభమయింది .ఆమె విరహ నిట్టుర్పుల వేడికి ఆగ లేక సూర్యుడు చల్లగా ఉంటుందని హిమాలయం వద్ద ఉత్తరానికి మొగ్గాడట .విరహం అనే బాట సారికి దాహమైతే అగ్ని వెంట తడి కూడా వచ్చినట్లు మన్మధుడు దండెత్తి వస్తున్నాడని సూచించే అతని జెండా పై గల మీనం (చేప )తో పాటు మేషం (రాశి )కూడా వచ్చింది .హేమంత చలి యువతుల్ని కావలించింది .వసంతుడు అనే ప్రియుడు ముందుకు వచ్చి వెచ్చదనం కల్పిస్తాడనే భావంతో హేమంతం చివరి ముద్దు పెట్టుకొని వెళ్లిందట .చలాకీ చంద్రుడు సూర్య కిరనాలంత వేడి పుట్టించి విరహుల్ని వేధిస్తున్నాడు .వసంత రుతువు అనే మంత్రిని ,కొత్త గా పుట్టిన వసంతుని బొడ్డు కోసిన కొడవలి లాగా కోయిల కూత యువతీ యువకుల్ని విరహం తో కోస్తున్నాయి .శివునికీ పార్వతీ దేవికీ ప్రణయం కల్పించ టానికి మన్మధుడు వేసిన పూల బాణాల మొనలు విరిగి ,చివుళ్ళు గా వేలుస్తున్నాయత. భూదేవి కడుపు లోంచి పుట్టిన వ్రుక్షాలనే పిల్లలకు పాల పళ్ళు ,దంతాలు మొలిచి నట్లు లేత చిగుళ్ళు పువ్వులు , పిందెలు పుడుతున్నాయి .వన లక్ష్మి రాబోయే మాధవుని అలంకరించ టానికి సింగారించు కొందిట .”. దేవత్వం సిద్ధిన్చినా ,మధు పానం అనే దురభ్యాసాన్ని వదలని తుమ్మెదలను వెక్కిరిస్తూ , తనకుపంచత్వం రారాదని ,పంచమ స్వరం తో కోయిల కూస్తోంది .మాధవుడు మామిళ్ళకు , పూలను సృష్టించి ,పిందెలు గా మార్చి ,మన్మధునికి ఆయుధాలు ,సరఫరా చేస్తున్నాడట .దేవుడే శత్రువుకు మేలు చేస్తుంటే విరహ గ్రస్తులకు దిక్కు లేకుండా పోయిందట .మధు మాసం అనే ఆవు పొదుగు నుండి పాలు కారు తున్నట్లు చంద్రుని వెన్నెలల తో భూలోకం తడిసి ,కమ్మని వాసనలనిస్తోంది .తుమ్మెద బారులు మన్మధ బాణానికి నారిగా మారు తోమ్దట .యువతుల చంద్ర బింబాల వంటి మొహాల కన్నా ,చను దోయి కంటే మాకే ఎక్కువ యవ్వనం వుందని పద్మాలు విరగ బూసి నవ్వు తున్నాయట .భ్రుగు మహర్షి తన్నినా నవ్వేసిన విష్ణు మూర్తి వెంకటేశ్వరుడై ,పద్మాతిని పెళ్ళాడాడు .ఆమె సత్య భామ గా మారింది .స్త్రీలందరికీ ఆ అంశ అంటించింది .ఏ స్త్రీ తన్నినా అశోకవృక్షం బంగారు పూలతో పూసినట్లు నవ్వు తోందట .మాధవుడు రాసాతలాన్ని , మకరంద వర్షం తో ,భూమిని పూలతో ,ఆకాశాన్ని పుప్పొడి తో జయించి ,త్రిలోక విక్రముడైనాదట .చిలకకు జామి పళ్ళు మేత గా ఇచ్చిన వసంతుడు ,ప్రేయసీ ప్రియులకు పూలు పంచి , తుమ్మెదలకు తేనె లిచ్చి ,వసంత లక్ష్మికి వెచ్చని కొగిలి ఇచ్చి ,పక్ష పాతం లేదని పించాడట.....!!!!! - Kks Kiran

by Kks Kiran



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pw2Jx1

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి