పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, మార్చి 2014, సోమవారం

Jyothirmayi Malla కవిత

||జ్యోతిర్మయి మళ్ళ|| కవి మితృలందరికీ జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! గజల్ ఆకాశమే ఒక కాగితం హరివిల్లు దించేసుకోనా నామనసునే కుంచెగా ఒక బొమ్మ నే గీసుకోనా ఆ కొండ కోనల్లో ఆగనా ఆ వాగు నీరల్లె సాగనా నాకంటిలో ఆ సోయగం పదిలంగ నిధి చేసుకోనా ఆ తీగ పువ్వల్లె నవ్వనా ఆ కొమ్మలో కోయిలవ్వనా ఈ గుండెతో ఆ గీతిని లతలాగ పెనవేసుకోనా ఓ మేఘ నీలమై మారనా ఓసంధ్య ఎరుపై జారనా ఆ వర్ణ కాంతులే నిండుగా వొళ్ళంత నే పూసుకోనా మధుమాస సుధఅంత గ్రోలనా మదిఅంత పులకింత తేలనా వసంతమంత ఇంతగా నాచెంత ఉంచేసుకోనా ఓ మావి మాలై మురియనా ఓ రంగవల్లై విరియనా ఉగాదివేళ ఓ జ్యోతినై మీకంట నను చూసుకోనా (31-03-2014) (ఈరోజు విశాఖ పోర్ట్ ట్రస్ట్ సాహితీ సంస్థ 'సాగరి ' నిర్వహించిన కవిసమ్మేళనం కోసం నేను రాసి పాడిన గజల్ )

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iRlUi5

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి