పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, మార్చి 2014, సోమవారం

Usha Rani K కవిత

మరువం ఉష | అనాదిగా ఇదే ఉగాది ------------------------------------- గగనాలు పోసిన చినుకుల తలంబ్రాలు- సెలయేటి కాంతకి ఒడిబియ్యాలు, ఊటనేలలో ఎదిగిన చెరుకు బెల్లాలు అవుతాయి. కోయిలమ్మ చివురులతో సరిపెట్టుకుంటే, చిలుకమ్మ పిందెలు చిదిమి వదిలితే, మామిడికొమ్మ మళ్ళీ కాయలు కానుకిస్తుంది. చింతలెరుగని బతుకుండదని, ఈదులాడనంటే ఒడ్డు ఆమడదూరాన్నే ఆగిపోతుందని, పులుపు మేళవింపు చింతచెట్టు తన వంతుగా పంపుతుంది. కాకమ్మ ఎత్తుకెళ్ళిన పళ్ల లెక్కలడగని, గాలిగాడు రాల్చిన ఆకుల అజ పట్టని, వేపమ్మ చేదుమందే శాస్త్రమని పువ్వులో పెట్టి చెప్తుంది. కారాలు చెపుతాయి ఊరూపేరూ వివరాలు- ఆరబోసిన మిరప మిలమిలలే ఉగాది నోటికి కారాలు, కంటికి నీరూను. ఏడేడు సంద్రాలు ఎన్ని యుగాల కన్నీటి కాలువలో? శోకాలు లేనిదే శ్లోకాలు పుట్టవనేమో, రవ్వంత ఉప్పు కలపని ఉగాదికి నిండుదనం రానేరాదు. గులకరాయంత కష్టానికి ఫలం, బండరాయంత సుఖం... కష్ట సుఖాల కలబోతల జీవితాలు ఉగాదికి ఉగాదికీ నడుమ షడ్రుచుల విస్తర్లు. 31/03/14

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1moVzZv

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి