పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, మార్చి 2014, ఆదివారం

Sree Kavitha కవిత

శ్రీ కవిత ॥ ఏమని వర్ణించను ॥ 23.04. 2013 పచ్చని ప్రకృతి వడిలొ సెలయేటి నుంచి వీస్తున్న చల్లని పైరగాలి శబ్దం వేణుగానమై వినిపిస్తుంటే కోకిలలు మన కలయికు శ్రుతి కలపగా నా హృదయమంజరివైన నీతో మనసువిప్పి మట్లడాలనుకోంటున్న సమయంలో నీ గురుంచి చెప్పమంటే ఏమని చెప్పను ..!! తెల్లని పద్మం లాంటి నీ ముఖము చూసి చక్కని చెలిమికి, పవిత్రతకు చిహ్నం అని చెప్పనా .?? నీ నుదుట గల ఎర్రని బొట్టు చూసి శ్రమించి ఉన్నత శిఖరాలను అందుకోగలవని చెప్పనా...?? నీలిరంగు గల నీ "అక్షులు" చూసి విశాలమైన నీ హృదయమునకు ప్రతీక అని చెప్పనా ..?? పసుపు పచ్చని నీ శరీర వర్చస్సు చూసి నీతో, నీవారికి శుభములు కల్గునని చెప్పనా..?? లేత ఆరంజ్ రంగుగల నీ చీర చూసి కష్టాలలో, త్యాగానికి గుర్తు అని చెప్పనా....?? ఆకుపచ్చని రంగుగల నీ చేతి గాజులు చూసి నీ ఇల్లు సిరిసంపదలకు ఆలవాలమని చెప్పనా పింక్ రంగుగల నీ పాద పద్మంలు చూసి నీ సున్నిత వ్యక్తిత్వానికి నిదర్శనమని చెప్పనా..?? లలిత కళలతో, అపూర్వ మెధాశక్తితో మంచి స్పూర్తితో, స్నేహమాదుర్యం పంచుతున్న నా "స్నేహమాధురి" వన్నెల రవళి అయిన నీ గురుంచి !! ఏమని వర్ణించను...??!!

by Sree Kavitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NGhPBR

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి