పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, మార్చి 2014, ఆదివారం

బాలసుధాకర్ మౌళి కవిత

ప్రగతిశీల సాహిత్య సంస్థల అవసరం.. యిప్పుడు కచ్చితంగా వుంది ! 1 సకల వ్యవస్థలూ ధ్వంసమైపోతున్న వొకానొక ఎడారితనం మన దేశంలో పరుచుకుని వుంది. గత నలభై, నలభై ఐదు సంవత్సరాలుగా దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ వొక అనిశ్చిత స్థితి వ్యాపించింది. వొక స్తబ్దత ఆవరించింది. నైన్టీస్ తర్వాత Globalization ప్రభావం చేత మరింత వేగంగా వైషమ్యాలు సమాజాన్ని పట్టిపీడించడం మొదలుపెట్టాయి. మనుషులలో నిజాయితీతనం స్థానంలో నటన ఆక్రమించడం, ఉత్త వెర్రి భ్రమలు పెరగడం, వస్తువీకరణ జరగడం - ఇవి అత్యంత విషాదకర దశాబ్దాల అనుభవాలు. ఈ స్థితి నుంచి బయటపడడం ఎలా ? సామాన్యంగా విజ్ఞులకు తోచే ప్రశ్న యిది. బహుశా సాహిత్యం - ముఖ్యంగా 'పోరాట సాహిత్యం' దానికి జవాబు అవుతుందని.. అనుకుంటున్నాను. డబ్భైల్లో ఆ పనినే సాహిత్యం నెరవేర్చింది. కవితైనా, కథైనా, వ్యాసమైనా, నాటికైనా, నవలైనా - ఏ సాహితీరూపమైనా - సమాజాన్ని జాకృతి పరిచి, చైతన్యవంతం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనిని చరిత్ర నిరూపించింది. మానవ సమూహాలకు వెలుగు దారి చూపించే దివ్వె 'చరిత్ర' .. అని నమ్ముతున్నాను. 2 సాహిత్యం ప్రజలిది. ప్రజాబాహుళ్యాన్ని విముక్తి చేయడంలో సాహిత్యం అగ్రగామి. నేను ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఊరిలో - ఈ రోజు నేనొక Experiment చేసాననుకుంటున్నాను. ఫలితం - అనుకున్నట్టే వస్తుందని పూర్తి విశ్వాసం వుంది. నా మిత్రుని ఇంటిలో ఐదుగురు స్కూల్ పిల్లలతో.. 'వొక సాహితీ సంస్థ ఏర్పాటు చేసుకోవాలి' - అనే దానికి Ground work చేసాము. ప్రపంచంలో గానీ, దేశంలో గానీ - వాటి సూక్ష్మరూపాలైన గ్రామాలలో గానీ పరుచుకుని వున్న - సంక్లిష్టమైన సామాజికావరణం నుంచి - నూతన వ్యవస్థ దిశలోకి వెళ్లడానికి ఏం చేయాలి ? .. అనే ప్రశ్న గత రెండు సంవత్సరాలుగా నా మనసును దొలుస్తుంది. గత సంవత్సరం ముఖ్యంగా అదే పని కోసం నా పాఠశాల గల ఊరిలోకి మకాం మార్చాను. వివిధ కారణాల వలన ముఖ్యంగా అమ్మ మీద ప్రేమ.. నన్నా ఊరిలో వుండనివ్వలేదు. పిల్లల కోసం సాహితీ సంస్థను స్టార్ట్ చేయాలనే - నా మనసులో కదిలిన ఆలోచన. కానీ సాధ్యపడలేదు. ఈసారి సాధ్యం కాబోతుంది. సాహితీ సంస్థ బాధ్యతను పిల్లల భుజాల మీదే పెట్టాను. They are pillars of our country and world - వాళ్ల మీద నాకు చాలా నమ్మకం వుంది. నిర్భందం ప్రతి చోటా వుంటుంది. యిప్పుడు దేశంలో నిర్భందం వుంది. గ్రామాల్లోనూ వుంది. మనుషులు - శత్రువును గుర్తుపట్టని స్థితిలో దాడి జరుగుతుంది. దేశ సాంస్కృతిక సంపదపై దాడి జరుగుతుంది. వాటన్నింటినీ తట్టుకుని లేవాలి. లేస్తాము. దురదృష్టవశాత్తు మనలోని మనుషులే - ప్రపంచీకరణ మాయ వలన సామూహిక జీవనం నుంచి దూరమై.. వ్యక్తివాదానికి.. దాని పరిమితులకు కుదించుకుపోతున్నారు. యిది వొక సాహితీసంస్థకు చాలా ఇబ్బందులను బహుశా సృష్టించవొచ్చు. కానీ ఇబ్బందులను అధిగమించి విజయవంతంగా నిలబడ్డ చరిత్ర మన కళ్ల ముందు వుంది. 3 ఉగాది కవిసమ్మేళనంతో 'పిల్లల సాహితీ సంస్థ'ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. ప్రణాళికలో అంశాలు : ------------------------- అ. నెలకు రెండు, మూడు సాహిత్య సమావేశాలు నిర్వహించుకోవడం. ఆ. అభ్యుదయ సాహిత్య పుస్తకాలు, సాహిత్య - సామాజిక పత్రికలు చదవడం; అందులోని అంశాలు చర్చించుకోవడం. ఇ. తరుచుగా కవిసమ్మేళనాలు నిర్వహించుకోవడం. ఈ. ప్రగతిశీల కవిత్వం, కథలపై చర్చ. ఉ. మంచి వక్తల ఉపన్యాసాలను వినడం. ఊ. పట్టణాల్లో జరిగే అభ్యుదయకర సాహిత్య కార్యక్రమాలలో పాల్గోవడం. ఎ. సామాజిక పరిశీలన చేస్తూ.. దానిని కళ చేయడం. ఏ. విష సంస్కృతిని వ్యతిరేకిస్తూ.. సాహితీ సృజన చేయడం. ఐ. సభ్యుల సంఖ్యను పెంచడం. 4 సంస్థకు వొక పేరు కావాలి. పేరు కూడా చాలా ప్రధానం అనుకుంటున్నాను. మిత్రులు, శ్రేయోభిలాసులు, సాహితీ జీవులు, సాహిత్య ఆరాధకులు వొక పేరు సూచిస్తారని కోరుతున్నాను. పిల్లల సాహిత్య సంస్థే - కానీ వాళ్లతో పాటూ అది పెరుగుతుంది - భవిష్యత్తులో కూడా వాళ్లూ, వాళ్ల తర్వాత వాళ్లూ సంస్థను మోస్తారు. అందులో.. సీరియస్ అంశాలనే చర్చించడం జరుగుతుంది. పేరును సూచిస్తారని అందరినీ మళ్లీ మరోసారి కోరుతూ.. ధన్యవాదాలు. 23 మార్చి 2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jqPw4T

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి