పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, మార్చి 2014, మంగళవారం

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి వర్షం ఆకాశం నోరు తెరిచింది అంతే; హోరున వర్షం చెట్లు తడిసి ముద్దయిపోతున్నాయ్ మొక్కలు నానిపోతున్నాయ్ వంకలు, వాగులు, సరస్సులు పొంగిపొర్లుతున్నాయ్ ఇక నిండడానికి అక్కడ ప్రదేశమే లేదు అందుకే; ఇక మిగిలిన గుండెలు సైతం వర్షపు నీటితో నిండిపోయి చీకిపోతున్నాయ్ వర్షానికి ఆవేశం ఎక్కువ అందుకే కళ్ళల్లోంచి కూడా కురుస్తోంది చూపుల్ని నాకుతూ వర్షం అంటే అందరికీ ఇష్టం కానీ ఎందరికో కష్టం వర్షానికి మక్కువ ఎక్కువ అది చిరిగిన బ్రతుకుల్లోనే కురుస్తుంది జీవితాల్ని కూలుస్తుంది అంతా అయిపోయాకా ఏమీ ఎరగనట్టు నటిస్తుంది తెరిచిన నోరు తెరిచినట్టే ఉంటుంది శూన్యంలా అంతా శూన్యం చేసేసి ఆ శూన్యంలోకే చూస్తూ శూన్యం శూన్యంగానే మిగిలిపోతుంది అది ఎప్పటికీ నిండదు మళ్ళీ వర్షం కురిసే వరకూ! 04MAR2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OWNbFW

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి