పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, మార్చి 2014, మంగళవారం

Pusyami Sagar కవిత

డా. రావి రంగారావు గారు రాసిన కవిత !!నేత్ర రుచులు!! కవిత్వ విష్లేశణ ________________పుష్యమి సాగర్ !నయనం ప్రధానం ! అన్నారు, అట్టి నేత్రానికి జీవితానికి గల అనుసందాన్ని, అవి పలికే భావోద్వేగాలను రంగారావు గారు తమ కవిత లో వెల్లడించ ప్రయత్నం చేసారు ...కన్ను (Eye) కాంతిని గుర్తించి నేత్ర నరాల ద్వారా మెదడుకు సమాచారాన్ని అందించే అవయవం, అలాంటి అవయం అన్ని జంతువులకు వున్నా మానవ కన్ను కి వున్న ప్రాధ్యాన్యం గురించి ...వాటి విలువ ను చాటి చెప్పేది !! సాధారణం గా జిహ్వ కు సంబందించిన విషయాలు మననం చేసుకునేప్పుడు !రుచులు! అన్న పదం వాడతాము..కాని ఇక్కడ నేత్ర సంబదించిన జీవితపు అనుభూతులను ప్రతిరూపం గా వాడారు ...వెలుగు చీకటి మధ్య అనుసందానమే కదా నేత్రం, అందుకే మొదటి పంక్తి లో //కన్ను తెరిస్తే ఎంత వెలుతురో... జీవితం // !!కన్ను మెరిస్తే ఎంత వెలుతురో... ఆశ కన్ను కలిస్తే ఎంత వెలుతురో... ప్రీమ !! కళ్ళలో మెరుపు ను ఎప్పుడు చూస్తాము ఏదైనా ఆశ కనిపించినపుడు, జీవితం కష్టాలలో ను .బాధలో ను ..వున్నప్పుడు ఒక దారి కన్పించి తొవ్వ చూపి నడిపిస్తున్నపుడు కలిగే మెరుపు ఆశ ....అలాగే ఇద్దరు స్త్రీ పురుషులు కళ్ళు కలియక లో మెరిసిన వెలుతురూ ప్రేమ కు దారి తీసెదే కదా... !కన్ను తడిస్తే ఎంత వెలుతురో... అభిమానం కన్ను కురిస్తే ఎంత వెలుతురో... పశ్చాత్తాపం ! తడవటం ..కురవటం ఒకటే నా...రెండు ఒకే అర్థం గా కానవచ్చే రెండు వేరు వేరు పదాలు, మన సన్నిహితుల ను చాల రోజుల తరువాత కలిసినపుడో , లేదు ఒక వ్యక్తి పై అపరిమితమైన ప్రేమ అభిమానం కురిపించే ధీ తడవటం , కురవడం అంటే ధార గా పోవడం మన వలన అపకారం జర్గినపుడు, దాన్ని సరిదిద్దుకునే అవకాశం పశ్చాత్తాపం ! వాటి తో వచ్చే కన్నీరు కురవడం ... చిట్ట చివరి గా కన్ను మూసినా వెలుతురే బతుక్కి ఆవల తీరం లో అనగా ...చివరి దశ మరణం మే ... అక్కడ ప్రశాంతం తో మలి దశని దాటి మరో లోకం లో పయనించాలి //కన్ను మూస్తే ఎంత వెలుతురో... బతుక్కి ఆవలి తీరం.// రావి రంగారావు గారు ఎంతో సులభం గా అందరికి అర్థం అయ్యే రీతిగా రాసారు ...వారి కవిత లో ఎంతో గొప్ప జీవిత అర్థం దాగి వున్నది. మరిన్ని మంచి కవితల తో ముందుకు కొనసాగుతారు అని ఆశిస్తూ . సెలవు ...(మార్చ్ 5, 2014) ===== డా. రావి రంగారావు (నేత్ర రుచులు) కన్ను తెరిస్తే ఎంత వెలుతురో... జీవితం కన్ను మెరిస్తే ఎంత వెలుతురో... ఆశ కన్ను కలిస్తే ఎంత వెలుతురో... ప్రీమ కన్ను తడిస్తే ఎంత వెలుతురో... అభిమానం కన్ను కురిస్తే ఎంత వెలుతురో... పశ్చాత్తాపం కన్ను మూస్తే ఎంత వెలుతురో... బతుక్కి ఆవలి తీరం.

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q1IGaL

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి