పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, మార్చి 2014, శుక్రవారం

Patwardhan Mv కవిత

సందర్భం -04: ఇది ఎవరిది? హాయ్ పోయెట్స్ ఆండ్ ఫ్రెండ్స్!గుడ్ ఈవ్నింగ్.వెల్ కం టు సందర్భం -04. ఓ ప్రసిధ్ధ కవి పద్యం. //// హార్మోనియము మెట్ల మీద అడుగులేసుకుంటూ ఆంజనేయుడు సంజీవి పర్వతాన్ని తీసుకెళ్ళినట్లు నా శరీరాన్ని అలా అరచేతితో పెట్టుకొని గాలిలో తేలిపోతోంది రైలు అస్థిపంజరాల సమూహాలు పరుగెత్తినట్లు శబ్దం ఒకటే వెంటాడటం పెట్టెలోని గాలి నీళ్ళలోని నావలా అటూ ఇటూ కొట్టుకుంటుంది వాగ్యుధ్ధాల్లో మిగులుతున్న శూన్యమూ రైలు వంతెనని నములుతున్న భయంకర శబ్దము కాళ్ళకి ఇనుప సంకెళ్ళతో పరుగెత్తుతున్న భూమి అక్కడికక్కడనుండే తిరిగి తీవ్రంగా పైకి లేచి కన్నీటి బొట్టులా భూమిలోకి కూరుకుపోయే దుమ్మూ అడుక్కునే గుడ్డాడి గుంట నీళ్ళలో స్థిర నివాస మేర్పరుచుకున్న చీకటి ఇవన్నీ రెపరెప కొట్టుకుంటున్నాయి ......ఏదో స్టేషనొచ్చింది,రైలు భూమ్మీదకు దిగింది గుక్కెడు టీ నీళ్ళకోసం రైలు కిటికీలన్నీ వేల చేతుల నోళ్ళు తెరిచాయి //// ఎవరిదీ సాహిత్య ప్రయాణం??పదండీ మనమూ చేద్దాం. 28-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o8fvo6

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి