పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, మార్చి 2014, శుక్రవారం

Chi Chi కవిత

_ కోణం _ గాలి దిశలాడుతుంటే వాన దారి మళ్ళిoదని మట్టెళ్ళి గురుత్వాన్ని తిడితే క్షేత్రమేంచేస్తుంది మట్టి బరువుతో ముల్లొంగి గుండ్రం గుడ్డులా మారినా భ్రమణమాగలేదుగా !! తడిసినంత తానై కడవైన సాగుని చూసి కడుపులున్న కళ్ళొచ్చాయని కరుణ రాదు చినుకుకి కటికసాగు చేయాలని!! భేదం అభిప్రాయమే.. స్వదేశమో , విదేశమో నిప్పు నిలువుగా పోదు నీరు అడ్డమొచ్చిoదని ధర్మం అనుమానమే.. స్వధర్మమో , అధర్మమో నింగి ముక్కలవదు నియంతమే అనంతమని తెరుచుకున్న గర్భంలో గింజ వృక్ష్మమవుతుంటే తెంచుకున్న మొక్క ఒకటి మనిషి పేరు పెట్టుకుని సాగు సాకు వంటబట్టి సాకులతో సాగుతుంటే కూడగట్టి ఉన్న మట్టి కడలొడిలో కునుకు తీస్తూ....... (28/3/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o7Ldli

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి