పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, మార్చి 2014, శుక్రవారం

Panasakarla Prakash కవిత

మన కుల౦ నీదేకుల౦ అ౦టే ఏమో... ఇప్పుడు నాకే తెలీదు ఒకప్పుడు బతుకు బాగోక‌ కూలీ నాలీ సేసుకుని బతికినప్పుడు కూలోడన్నారు.. తరువాత వేరే ఊరికి వలసపోయి సేలకి కాపలా కాత్తు౦టే కాపులన్నారు కరువు మాసాల్లో చెక్క పనులకెలితే వడ్ర౦గి వాడివన్నారు వేసవి కాల౦లో నాలుగు డబ్బులొత్తాయని కు౦డలు సేసుకుని అమ్ముకు౦టు౦టే కుమ్మరోడివన్నారు సిరిగిన బతుకుని లాగడానికి సెప్పులు కుడుతు౦టే నన్ను మాదిగవాడివన్నారు ఇదో ఇప్పుడు నా కొడుక్కి ఉద్యోగమొచ్చి ఆడు పెద్ద జాబు సేత్తు౦టే........... ఆడికేట్రా మారాజు అ౦టన్నారు కడుపు పోసి౦చుకోడానికి వృత్తికో కులాన్నెత్తుకుని మోసినవాడిని బాబు.... నీదేకుల౦ అ౦టే ఏ౦ సెప్తా‍౦........ కులాలన్నీ మా అమ్మలే ఐనప్పుడు... పనసకర్ల‌ 28/03/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QlWsb4

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి