పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, మార్చి 2014, శుక్రవారం

Laxman Swamy Simhachalam కవిత

(ఇది నాకవిత కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ కావట్లేదు పెద్దగా ఉన్నందుకేమో? ....అందుకే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను దయచేసి తొలగించకండి వారడిగిన వివరణ ఇది ) 'దగ్ధ మోహన గీతం !!’ కవిత పట్వర్ధన్ లాంటి సాహితీ వేత్తలకు అర్థ౦కాదని నేను భావించను .అయితే కొందరు అర్థం చేసుకోలేక పోతున్నాం అన్నారు ....ఏది ఏమైనా నెలరోజులుగా నాలో చలరేగేభావచిత్రాలన్నీ ఈ కవితలో చెప్పటానికి ప్రత్ని౦చాను ..నేనేం భావించానో, చెప్పదల్చుకున్నానో నాద్వారానే ఎంతో అభిమాన౦తో ప్రేమతో చెప్పించిన పట్వర్ధన్ జీకి హృదయ పూర్వక కృతజ్ఞతలు.....తీవ్ర ప్రసవ వేదనతో పరిపూర్తి చేసిన ఈ కవితపై తప్పక మీ స్పందన వ్యక్తం చేస్తారని ఆశిస్తూ .... ........... మీ ఆత్మీయ కవినేస్తం సింహాచలం లక్ష్మణ్ స్వామి. ‘కరకు శిలా పుష్ప పత్ర ఆకు రాగపు శిలాజం జ్వలిత నేత్ర పర్వత నయనం......’ కఠిన హృదయాల్లో కలిగిన హరిత స్పందనకు కళ్లి౦త చేసుకుని ఆన౦దిస్తున్న పర్వతం ...! ‘అరణ్య వీణ కొ౦డ గుహలో నాదం !’ పులకరించి పరవశించి స్పృశించే వన వీణ గంభీర సంగీతం కొండగుహల్లో సైతం ప్రతిధ్వనిస్తూ .... ‘ఇసుకరేణువుల కేంద్రకాల్లో ప్రకంపన కడలి అడుగున తడబడ్డ కెరటం ….’ ప్రకృతి ప్రళయ విలయానికి ఇసుకరేణువుల కేంద్రాల్లోకూడా ప్రకంపన .....ఆగర్జనకి ఎడారి ఇసుకే కాదు కడలి అడుగు వరకూ తడబడ్డ అలలు !! ‘గుడ్లగూబ నేత్రపు చూపుల్లో అంగారక సౌందర్యం..... !!’ చీకట్లో కిలోమీటరు దూరాన ఉన్న ఎలుకను సైతం స్పష్టంగా చూడగలదట గుడ్లగూబ !! కానీ మనిషి గుడ్లగూబ నేత్రాల్లాంటి ఉపగ్రహ టెలిస్కోపులతో గ్రహా౦తరాన్వేషణ చేస్తూ భూమండలాన్నే కాదు అంగారక ‘సౌందర్యాన్ని’ కొల్లగొట్టే దుష్ట పన్నాగానికి శ్రీకారం చుట్టాడు. ‘గబ్బిలాల బిలాల్లో చలరేగిన ఆర్త నాదం....’ కానీ కోట్లాది చీకటి బ్రతుకులు అభివృద్ది వెలుగు చూడలేని చీకటి గబ్బిలాల బిలాల్లా౦టి జీవిత ఆర్త నాదాలు ‘ తాజ్మహల్ పునాదుల్లో పావు ‘రాళ్ళు’!!’ ప్రపంచ వింతల్లో ఒకటైన,ప్రణయ గోపురంగా కీర్తించ బడుతున్న తాజ్ ని కట్టిన అమాయక పావురాళ్ళ లాంటి కూలీల సమాధులు పునాదుల్లో ........!! ప్రేమ చిహ్న దేశంలో ప్రేమ పేరుతో జరిగే దారుణ మారణ కాండకు దృష్టాంతంగా మరోభావం ! ‘ఎండమావుల్లో చంద్రవదన మాయా మొహం దాహం తీరదు ! ’ ఎడతెగని ఆశనిరాశలమధ్య ఉగిసలాడుతూ .... ఎండమావులవెంట వృధా యానం ... ప్రేమామృతపు ఒయాసిస్సు కాదది మోసపోకు నేస్తం ! ‘అగ్నిశిఖల్లో ఆవిరి చినుకు కునుకు తీస్తూ ...’ విద్యుత్తును సృష్టించగల శక్తివంతమైన ‘యువ’ ఆవిరి చినుకులు కునుకు తీయటం భాధాకరం !! ‘శిథిల ఆలయాల్లో సమాధైన ఓంకారం’ మతాల మారణ హోమం ..నిధుల దురాశ , నాగరికత పుణ్యమా అని అంతరిస్తున్న ఆలయాల్లో ‘ప్రణవం’ సమాధి ! ‘పూల పెదాల సుధల్లోకి జాలువారిన అక్షరం’ సామాజిక బాధ్యత మరిచి అనేక అక్షరాలూ లేత పెదాల్ని పదాలు చేస్తూనే ఉన్నాయి ! ‘పొన్న చెట్టు వేళ్ళ అడుగున సన్నాయి పాట వింటూ సమాధి ఆత్మల తన్మయం !’ మాయమైన మనిషి అతని సృజనాత్మకత మలినమెలాగు అయ్యాయి సహజాత పరిమళాలు కరువయ్యాయి ..కానీ ప్రకృతి మాత్రం తన సహజత్వాన్ని కాపాడుతుంది. కృత్రిమత్వానికి సమాధిగా మారిన సృజనాత్మక ఆత్మలకు ప్రాకృతిక గీతంతో తాదాత్మ్యం పొందారని ............... ‘నెత్తుటి ద్వారాల్లోనుండి జాలువారిన వెన్నెలని కాల్చిన లావా !’ ప్రపంచ అవినీతి రక్కసి నెత్తుటి దాహం అనంతం ఎక్కడో ఒక్కడు నిక్కచ్చిగా నిజాయితీగా బ్రతుకుదామని వస్తే నెత్తుటి ద్వారాల్లోనుండి మానవత్వపువెన్నెల్ని రాజకీయ లావా కాల్చి పారేస్తూనే ఉంది !! ‘బిచ్చగాడి పళ్ళెం లో పరవశిస్తున్న నాణెం, ఖణ్ ఖణ్ మంటూ ...!’ దానగుణమబ్బిన మనిషి దానవత్వాన్ని దాటి వచ్చిన ఆ నాణెం బిచ్చగాడికి మెతుకవుతున్నందుకు ధన్యమైన పరవశం !! ‘చర్చి గంటలు ఆకలి మంటలకు తోడయి జ్వలిస్తూ ...!’ చలికాలపు రాత్రి వేళ చర్చి గంటలు స్పష్టంగా వినిపిస్తాయి కానీ నిద్రనుండి ఉలిక్కి పడ్డ అనాధ పేద ఆకలిని తీర్చ లేవు నిద్ర మేలుకున్న ఆకలి పునారావృతమవుతూనే ఉంటుంది !! ‘నక్క స్వప్నంలో నగ్నమైన యువరాణి పరాభవానికి తోడేళ్ళ దండోరా !’ సమాజాన్ని పీక్కుతినే నరాసుర బందిపోటు ముఠాల పగటి కలల ‘మానభంగ ధ్వంస రచన’కి కాకీ ....నల్లకోటు ...రాజకీయ ‘తోడేళ్ళ’ సహకారం ..! ‘నీరెండిన భావిలోని కప్ప కన్నీటి కొలనులో విచ్చుకున్న కలువ ఆరే ఆఖరిదీపం !’ ఆఖరి ఆశా చచ్చి పోయాక బ్రతుకు ఎడారిలో దాహం తీర్చే చివరి అశృ చినుకు ఆఖరి దీపం !! ‘రాలు పూల పాటల్లో రెల్లుగడ్డి పూల గర్జన!’ కష్టాల కాష్టాలతో రగిలిన సామాన్యులకు బాధలు తీర్చే బీరాలు పలికి నేతలు బేరాలకు లొంగి పోయాక రెల్లుగడ్డి సామాన్యుల తిరుగుబాటు ! ‘గడియారపు ‘ముళ్ళు’ దిగి ఉబికిన రుధిర వరదల్లో చేపల హంగామా !!’ గానుగెద్దు జీవితం నలభై దాటినా ఉద్యోగమూ లేదు .... వచ్చినా కాని కల్యాణం... కాలం కాటుకు విలపిస్తున్న బ్రతుకు oఓ వేపు సమాజపు ‘మీనాల’ వ్యంగ్యాలు .............!! “వడ్రంగి పిట్ట చెక్కిన బొరియల్లో ని వజ్రాల మూటల రాశులకి కాపలా వున్న కాల నాగులు !” ఆరుగాలం కష్టపడి రైతన్న పండిస్తే దళారులు ధాన్య రాశుల్ని కొల్ల గొడతారు చింతాకంత చెల్లించి ....తాటాకంత తరలిస్తూ.. వజ్రపంటల్ని !! ‘కోన ఊపిరిని కొవ్వత్తిని చేసి ప్రాణ దీపాన్నాపే శ్రామికుని గొంతు పై వేలాడుతున్న ఖడ్గం !’ ఎలాగైనా బ్రతకాలి, బ్రతాకాలంటే పోరాడాలి! మధ్యతరగతి వధ్య శిలపై ప్రపంచ శ్రామిక వర్గం !! గనుల్లో.. క్వారీలలో.. లారీల్లో ... అతిప్రమాదకర పనులు చేస్తూన్నా ఆర్తిక ..ఆరోగ్య ...సామాజిక ...రాజకీయ సవాలక్ష సమస్యల ఖడ్గం.................... ‘కుత్తుకల్ని కోసే కసాయి స్వప్నాకాశాన కారుణ్య జాబిలి !’ కొందరి వృత్తి కసాయిదైనా హృదయం చందమామే ! ‘మన్మధున్ని కాల్చేసిన విభూధి నుండి ఉన్మాది ఆధ్యాత్మికం !’ శ్రీరంగ ‘నీతులు’ చెప్పే బాబాలు ‘కామ దహన’ కథలు చెప్పి నీతుల్ని పాతరేసే మేకవన్నె ఉన్మాద ‘ఆద్యాత్మిక’ నీతులు ‘చీమలు వెంటే గొర్రెలు మేకలు ... చిలుక పలుకుల సారంగి !’ ఎన్ని చూసినా ఎంతెంత తెలుస్తున్నా అన్నీ తెలిసినట్టే అనిపించే సామాన్యులు ఓట్ల బెల్లానికి చీమలై ..నోట్ల గడ్డికి గొర్రెలై , రంకు సారంగి రాజకీయ మాటలు వింటూ మోసపోతూ !! ‘నెమలి మా౦సం తింటూ జాతీయ గీతం పాడే ‘మార్లు మాతంగి’ విచ్చలవిడిగా వన్యప్రాణుల్ని భోన్చేస్తున్న ‘పెద్దలు’ జాతీయ ప్రేమను టీ. యం. సీల కొద్దీ కుమ్మరిస్తారు ....!! మర్లుమాతంగి అనేమొక్క కదులుతూ ఎప్పుడూ రూపం మార్చుతుందట ఇలాగే !! ‘సవా లక్ష భిన్న పూల విలక్షణ కాందీశీక కవి సంచి నిండా కమిలిన, అమలిన అక్షర పుష్ప భాష్పాలు !!’ సవాలక్ష సమస్యలన్నీ నాబాధై.......కవిత్వమై ఇప్పుడు కవి సంగమం లో ...............................!!!!

by Laxman Swamy Simhachalam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fsNT3M

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి