పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, ఫిబ్రవరి 2014, శనివారం

Swatee Sripada కవిత

వద్దనుకుంటూనే ఎందుకో వద్దనుకుంటూనే ఎందుకో ఆశపడుతూనే ఉంటాను సుడిగుండమై లాగేసుకు౦టున్న నిద్ర వలయంలో నీపాట పూదోట పరిమళ శ్వాస నును వెచ్చగా పలకరించాలని ఎక్కడానీ జ్ఞాపకాల మజిలీలో నాకేమాత్రం చోటు లేనట్టు అలా ఎవరెవరి వెనకో దాక్కుంటూ పిల్లమేఘంలా అయిష్టంగా కదలిపోతూ చూసే నీ చూపు ఉదయరాగంలో అరుణిమనై వేగుచుక్కలా వెలుగులు వెదజల్లాలని అయినా ఎంత దాచాలనుకున్నా ఏసందు గు౦డానో సాగి వచ్చే పగటి వెన్నెల్లాటి మెరుపు ఇక్కడ నామనసుచెక్కిళ్ళపై రంగులద్దుతూ ............. 2. ఇంకా మసక చీకటి శిశిరం మంచు వాన ఆగక మునుపే తొ౦దరపడి రెక్కలు మొలిచిన అడవి వన్నెలు పేనుతూ ఒక్కొక్క ఊహనూ హరివిల్లు ముక్కలకు కట్టి గాలి పటాలుగా ఎగరేసుకుంటూ కూని రాగపు కులుకు నవుతాను నన్ను నేను నీ చుట్టూ అల్లుకునే గురివింద పొద నవుతాను ౩. ఎప్పుడో ఊహకందని తలపుల్లో ఎక్కడో పారేసుకున్న నీ ఉనికి ఇలా తీగలు తీగలుగా కురుస్తున్న ఈ విప్పపూల విభ్రా౦తిలో రాతి’కన్న కఠీనమైన పల్చని పరదాల వెనక దాగుడు మూతలాడుతూ క్షణం అదృశ్యంగా క్షణం సదృశ్యమై ఎందుకీ సయ్యాటలు 4. చివరకు వాలిసోలిన కనురెప్పలపై వణికే పెదవుల ఆర్తి ఊపిరి వేణువు పాటకు గొంతు కలుపుతూ అణువణువునూ నిమిరే సుగంధ పరిమళ మై

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ecFYFY

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి