పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, ఫిబ్రవరి 2014, శనివారం

సిరి వడ్డే కవిత

ll అపురూపమే ll మెరిసే గాజుల గల గలలతో చిరు చేపల నయనాలతో సిరి మువ్వల సవ్వడితో బుడి బుడి నడకలు... అపురూపమే కోకిలమ్మల స్వరానుకరణలతో తుమ్మెదల వెంట పరుగులతో బుజ్జాయిల సయ్యాటలతో యెదలో నిదురిస్తున్న జ్ఞాపకాలన్నీ.... అపురూపమే పంట కాలువల్లో చేపపిల్లల ఈదులాటలు లేత రెక్కలను విరుచుకుంటున్నగువ్వపిల్లల ముద్దు మోములు కోడిపిల్లల మధ్య కీచులాటలు లేగదూడల గెంతులాటలు ..అపురూపమే తెల్లారకముందే వినవచ్చే హరిదాసుల పాటలు రంగవల్లుల మధ్యన గొబ్బెమ్మల ముచ్చట్లు ఇంటింటా బసవన్నలు చేసే సందళ్ళు గాదెలు నిండిన కొత్త పంటలు ..అపురూపమే తోబుట్టువుల పండుగలు పరిమళించే మమతల కోవెలలు పసుపుకుంకుమల దీవెనలు ప్రేమతో పొంగే అన్నదమ్ముల హృదయాలు ..అపురూపమే చెమ్మ చెక్కా చేరడేసి మొగ్గా అందాల అక్కా చక్కని చుక్కా పొగడపూలదండలెన్నో నీకై తెచ్చానంటూ చెల్లి మోమున విరిసిన అభిమానపు కుసుమాలు ....అపురూపమే అమ్మ చీరను చుట్టి తడబడిన అడుగులన్నీ తూలిపడిన వేళలన్నీ అన్న నవ్వుల్లో జాలువారిన ముత్యాలన్నీ నాన్న ప్రేమలోని మురిపాలన్నీ ..అపురూపమే మందారాలే అరచేత గోరింటలై పూస్తే సింధూరాలే పారాణిలై పండితే మొగలిరేకులే పూలజడలై పరిమళిస్తే అమ్మ కంట వెలిగిన కోటి దివ్వెల కాంతుల మెరుపులన్నీ ..అపురూపమే గవ్వల పోగేతకై వెదికిన తీరాలు నెమలి పింఛమంటే(కన్నులు)మోజులు బళ్ళో చదువులంటే బేజారులు ఈత పళ్ళకై రువ్విన రాళ్ళు ..అపురూపమే నవవధువుల నోములంటూ కాలువలో కరిగే పసుపు గౌరమ్మలంటూ గోమాతలకు కుంకుమ పూజలంటూ అట్ల తద్దె ఊయలలంటూ..మురిసిన రోజులన్నీ ..అపురూపమే వాననీటి తడిని విదిలించుకునే పక్షి పిల్లలు జల్లుల భారంతో తలవాల్చిన పూబాలలు చూరులవెంట దారలుగా జారే వాన బిందువులు అమ్మ స్పర్శలో వెచ్చగా వదిగిన ముద్దు కూనలు..అపురూపమే జెండా వందనాలంటే తెలియని రోజులు మిఠాయిలకై వేచిన గడియలు జైహింద్ లకై ఎదురుచూపులు బడిగంటలు కొట్టక ముందే ఇంటికి పరుగులు ..అపురూపమే వేసవి సెలవుల్లో పల్లెలకు పయనం ఏటివడ్డుకు చేరిన పరుగుల ప్రస్తానం చెరువుగట్ల చుట్టూ ప్రదక్షిణం పిల్లగాలులతో ఆడిన వైనం ..అపురూపమే సెలవంటూ ..మరి రానంటూ సాగిపోయిన బాల్యం పసితనపు జ్ఞాపకాలనే దాచుకున్న స్మృతిపధం తుళ్ళి తుళ్ళి పడి జారిపోయిన చిరుప్రాయం పదిలమై నిలిచే ప్రతి క్షణం ..అపురూపమే బాల్యంలోనే ఆగిపోవాలంటూ అన్ని గడియలు పసి(డి)తనమే కావాలని నూరేళ్ళు ముక్కోటిదేవతలకు ఎన్నెన్నో మ్రొక్కులు జన్మంతా పసిప్రాయానికై ఎదురుచూపులు మరుజన్మకైనా తీరేనా నా ఆశలు ... ll సిరి వడ్డే ll 06/02/2014

by సిరి వడ్డే



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1c6FIZb

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి