పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Raghava Raghava కవిత

"విప్లవం" (published in జనవరి పాలపిట్ట) విప్లవం.. ఇలా నువ్వొచ్చావు గదా ఇంత వెలుతురును ఆ వేళ్ళతో మంత్రించి ముద్దచేసి నాకందించావు గదా.. ఇంకా ఈ కళ్ళలో భయం చారికలెక్కడివి చెప్పు- నిన్ను నమ్మాను గదా మాగాట్టో కలుపుకు పోయొచ్చిన అమ్మ ఒళ్ళో కందికాయలుంటాయని నమ్మినట్టు నాన బుజమ్మీది కండవా మూట లో తింటానికేంటియ్యో ఉంటయ్యని నమ్మినట్టు అన్నాన్ని నమ్మినట్టు అడవిని నమ్మినట్టు- ...వాళ్ళెప్పుడూ నా నమ్మకాన్ని మించే ఇచ్చారు నువ్వూ అంతే గదా ఇంకా ఈ కళ్ళలో భయం చారికలెందుకుంటయ్ చెప్పు- . . . నువ్వెప్పుడూ చెప్పకపోయినా నాకు తెల్సులే నీకు చానా మంత్రాలొచ్చు- వేల కాళ్ళతో నా మీదెక్కి నాట్యం చేస్తావు వేల చేతుల్తో నా పీకనొక్కి ప్రాణం తీస్తావు అంతలో అలా తాకి మంత్రించి మరలా ప్రాణం పోస్తావు -నా గుండె లోంచి మొలుచుకొచ్చిందేదో నీకోసం వెతుక్కుంటోంది ఏదో పంచుకోవాలని ఎక్కడున్నావింతకీ...? -ఒకానొక జొరం పొద్దున కాలిపోయే నుదుటి మీద నువ్వలా చెయ్యి వేసినపుడు రెపరెపలాడే గుండె చుట్టూ ఓ కోట కట్టినట్టు.. కొన్ని అనుభూతులెప్పటికీ కరిగిపోవబ్బా -ఇదిగో ఇంకా ఈ నుదుటి మీదే నీ చేయి మరిక ఈ కళ్ళలో భయం చారికలెందుకుంటై చెప్పు...!

by Raghava Raghava



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1euw0om

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి