పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Bhaskar Palamuru కవిత

సన్నని వెలుతురు ఇసుక వేస్తే రాలనంత నిశ్శభ్డం నాలుగు గోడల మధ్యన ఆశ నిరాశల మధ్యన రాలిపోతున్న ఆరాటాలు ఎగసి పడుతున్న అలల్లా పారేసుకున్నకోరికల్లా పొలాల వెంట పరుగులు తీసే లేగ దూడల్లా నింగిలో ఉవ్వెత్తున నిలిచే మువ్వొన్నెల పతాకంలా మెలమెల్లగా సన్నని గొంతు లోంచి రాగం తాకుతుంది! తనువంతా తమకంతో మరో తోడు కోసం లతలా అల్లుకు పోవాలని ఆరాట పడుతుంది గుండె గుండెలో ప్రేమను చల్లుకుంటూ సాగుతుంది ఏ దేవుడు చేతిలో రూపొందిన బొమ్మవో ఏ శిల్పి చేతిలో కదిలిన కుంచెవో గది నిండా గానపు పరిమళం గువ్వలా అంటుకుంటుంది ! వెలుతురూ వేకువా ఒక్కటయి పోయినట్టు ఆ గాత్రపు దరహాసం పెదవుల మీద ముద్దాడుతుంది మువ్వగా మారి పాదాల చెంతన సిరిమువ్వై అల్లుకుంటుంది ఆ బహుదూరపు బాటసారి మార్మికపు గాన గాంధర్వపు గానం వివశత్వంలోకి జారుకునేలా చేస్తుంది పాటంటే బతుకు పండుగ మనసు జాతర హృదయపు సంత రెండు గుండెల కుసుమ పరాగం లోకాన్ని వెలిగించే దీపం !!

by Bhaskar Palamuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cfFvc2

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి