పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

Padma Sreeram కవిత

మూసిన తల(లు)పుల వెనుక....Behind The Doors.. ||Padma Sreeram|| జీవితం అందమైన నది లాంటిది ఒక్కసారైనా తలపుల ఆనకట్టల తలుపు తెరవగలగాలి.. మూసుకున్న తలపుల్లోంచి స్వేచ్ఛనిచ్చిన గుప్పెడు భావాలు అనంత సమీరంతో కలిసి కడివెడు స్వాంతననిస్తాయి ఉక్కిరిబిక్కిరైన ఉద్వేగాల సుడిగుండాలనుంచి రివ్వున దూసుకు వచ్చే కలతల కల్లోలాల రాయీ రప్పానుండి మనసుకు స్వాతంత్ర్యాన్నివ్వగలగాలి కాసేపు మాత్రం వేగిరపడక అలా తలపుల తలుపు తెరచే వుంచాలి ఎద సొదనిండా పరచుకున్న చెలిమి పరిమళమో అభావ భావనా వీచికో మరేదో అక్కడే ఆవిరైపోకుండా ప్రకృతితో మమేకమైనట్లు మనసులోని మనసుకు చెప్పుకోగలిగేలా నాకు నేను పరిచయమవ్వాలి నేను నా లోలోపల ఇంకేలా ఎప్పటికీ తలుపు తెరవను అనుకున్న నాలోకి నేను తరచిచూసే కొద్దీ లోలోపల వర్ణరహితమైన కాంతి పరచుకుంటున్నంతలో ఒక్కసారిగా తెరుచుకున్న తలపుల కవాటాల్లోంచి ఇంద్రధనువేదో నాలో తట్టిలేపినట్లుగా పరవశించడం నే గమనించగలగాలి ఒంటరితనపు ఇడుములన్నీ ఒక్కోటీ తరిగి చివరి అధ్యాయంపై నీ చెలిమి వాక్యాలన్నీ ముద్రితమైనంతనే తలుపు మూసేస్తాను నీవొక్కరే నాలో ఒక్కో అణువూ భద్రం చేస్తూ నా ప్రియనేస్తమై...నాలో సమస్తమై మిగిలేంత వరకూ...ఇలానే ఇలానే...ఇలానే... Response Poems Of Kumar Varma K K Sir ji 3.2.2014

by Padma Sreeram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bUiQMq

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి