పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేష్కుమార్//అమ్మతో చెప్పకు// నా నరాల్లోంచి ఒక్కో బొట్టూ నేలమీద పడుతూంటే నువ్వడిగావు కదా మిత్రమా నీ ఆఖరి కోరికెంటని వేటాడ బడ్డ సూర్యుడి శరీరం లోని ఒక ముక్కని మంటలపై కాల్చుకుతింటూ.. "అమ్మకేమైనా చెప్పాలా?" అని నువ్వడిగావ్ "బంగారి తండ్రీ నీకు బాదల్లు వద్దు బాడిశే దెబ్బకూ బందూకులెత్తూ" అని పాడేది మా అమ్మ పలాష్ చెట్టు కొమ్మకు కట్టిన ఊయల్లో నన్నూపుతూ ఎంత అందంగా ఉండేదో మా అమ్మ... ఎర్రని కుంకుమ నాన్న చొక్కాకి పూసి ఎర్రబడ్డ చెక్కిలితో నల్లని నన్నూ గుండెలకు హత్తుకొంటూ ఏమైందో మరి నాన్న పొయాక అమ్మ కళ్ళు ఎర్రబడితే తల తెల్లబడింది కుట్ట్మిషను పైనే నా బతుకునూ అందంగా కుట్టాలని ప్రయత్నించింది ఆటలో ఓడిన నాడు "బేటా గెలవానోడెవ్వడూ సచ్చిపోడు కానీ బతకనూలేడు ఓడిపొయినా ఆడాలె" అనిచెప్పిన అమ్మ దెబ్బకి కట్టు కడుతూ నా కళ్ళు తుడిచేది ఎప్పుడూ ఏడవలేదు మా అమ్మ ఏదీ ఏడిపించలేదు మా అమ్మని కానీ మిత్రమా.... ఈనాడు భయంగా ఉంది ఇదిగో... ఈ తూటా నా గుండెలో దిగబడ్డ తూటా అమ్మని ఏడిపిస్తుందేమో లెదూ బాడిశె దెబ్బకు బంధూకెత్తలేక ఓడిపొయిన. కొడుకుని కన్నావ్....! అంటూ అమ్మని ఎగతాలి చేస్తుందెమో అందుకే నా ఈ మరణాన్ని అమ్మతో చెప్పొద్దు బాలెట్ బాక్సుల్లో భందించబడ్డ భారతమాత విముక్తికోసం చూసినట్టు అమ్మని నా కోసం అలానే ఎదురు చూడనీయ్...03/02/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k0Ohww

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి