పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

Nirmalarani Thota కవిత

ఏం రాయను . . . ? ? శతాబ్దాల నిశ్శబ్దంలో అర్ధం కాని శబ్దాలు . . గడ్డకట్టిన శైత్యంలో గోరువెచ్చని కిరణ స్పర్శ . . వారగా వేసిన తలుపు సందుల్లోంచి ఓరగా తొంగి చూస్తున్న చిలిపి చిరుగాలి . . మనసు వాకిలికి కట్టిన మౌన తెరలు భావ పవనాలకు అలవోలె కదులుతుంటే వాల్చుకున్న రెప్పల్లో అలవోకగా దోబూచులాడే ఊహ ఆగి పోయావేం . . ? వ్రాయమంటోంది . . కానీ . . ఏం రాయను ? ఎద పాత్ర పొంగి పొర్లితే జాలువారే అమృతపు సొనలైనా . . కావాలి . . గుండె గోడలు బ్రద్దలయితే జారిపడే రుధిర ధారలైనా . . కావాలి . . నా కలానికి . . ! ! సవ్వడి లేని ఎదసడిని రూపం లేని మధురోహని ఆకృతిలేని ఆలోచనా సందోహాల్ని భావంలేని స్తబ్ధ సుషుప్తతనీ చలనం లేని చూపునీ చూపు లేని చలనాల్ని శూన్యం నిండిన విశ్వాన్ని విశ్వం నిండిన అంతరంగాన్ని ప్రేమ లేని మనసునీ మనసు లేని ప్రేమనీ. . జీవం లేని జీవితాన్నీ జీవితం లేని జీవాన్ని. . శబ్దాల నిశ్శబ్దాన్ని . . నిశ్శబ్దాల శబ్దాన్ని. . సమూహాల శూన్యాన్ని. . శూన్యాల సమూహాన్ని. . అర్ధం తెలియని అక్షరాల్ని అక్షరాలు లేని అనుభూతినీ ఎలా . . ఎలా . . ఎలా కాగితం మీదికి ఒంపను? :తేది : 04.02. 2014

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e0M4ZK

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి