పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

Boorla Venkateshwarlu కవిత

//కట్టెలు కొట్టే వాడు//బూర్ల వెంకటేశ్వర్లు// అతను కట్టెలు కొట్టే వాడు అవును నిజంగానే అతడు అన్నంకోసం కట్టెలు కొట్టే వాడు ఇంట్లోని చిన్నమ్ములు కట్నం కోసం అమ్ములు అమ్మ ఆరుగజాల చీరకోసం అతడు కట్టెలు కొట్టే వాడు అతని నల్లని పొట్ట లోపలికి నోరు తెరుచుకున్న గుహలా మారుతుంటే అతడు కాళ్ళను అయస్కాంతీకరించుకొని నడుమ్ముందుకు చాపి పంజా విసురుతున్నచిరుతపులిలా గొడ్డలితో కసిగా కష్టాల కట్టెల్నికొట్టేవాడు మోపులు మోపులుగా మూపున కాయలు కాయించి కుతికెలో పిడికెడు మెతుకుల్ని గుడిసెలో మూడు వెలుగు పుల్లల్ని నిలుపుకునేవాడు ఒకప్పుడు అతనికో గుట్టుండేది గుట్టకో చెట్టుండేది చట్టబద్దంగా ఇప్పుడు గుట్టలేదు చెట్టును పొట్టకోసం కూడా కొట్టరాదు ఇటున్నపుల్ల అటు పెట్టరాని వాడు అతణ్ణి కట్టెపుల్లను చేశాడు చిన్నమ్ములు చెట్టెడు కలలు ఎండుటాకులై రాలాయి అమ్ములమ్మ పాత చీర ఇపుడు మెడకు చుట్టుకుంది. పెట్టుబడి విషవృక్షం చెట్టును గుట్టను పొట్టకూటిని నమిలి మింగింది. తేది: 04.02.2014

by Boorla Venkateshwarlu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k81BiS

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి