పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, జూన్ 2014, బుధవారం

Raj Kumar కవిత

మడిపల్లి రాజ్‍కుమార్ //గాలి చూపులు// మొన్నటి ఆదివారం ఆంధ్రజ్యోతిలో నేను ఎండా కాలపు తీవ్రతను వర్ణిస్తూ రాసిన కవిత ప్రచురితమైంది. చుట్టూ పిల్ల సూర్యుళ్లు తలపైని చిల్లుల రేకులకప్పు ప్రసరించే కిరణబింబాలు కిటికీలోంచి దూసుకొచ్చే వడగాలులు ఒంటిమీద వేడివేడి కుబుసాలు వదులుతూ చరచరా పాకిపోతాయి నాలుగ్గోడలూ.. ఆ పైన రేకుల్లోంచి పొడుచుకొచ్చే అదృశ్య అగ్నిహస్తాలు ఎంతని మేగినా పొక్కిలౌతున్న నేలన నల్లినిజేసి నలిపేస్తాయి చెమటా.. దగడుదగడు పొగలూ కక్కుతూ శరీరమంతా ఒక ఆవిరియంత్రమౌతుంది విసుగు విసుగు విసుగు మనోవాక్కాయ కర్మలన్నిట్లో వెయ్యి రేకులుగ విప్పారిన విసుగు బయటికి చూస్తే వెండి తాపడం చేసినట్లు కండ్లు బైర్లుకమ్మే ఎండ నెత్తులు విరబోసుకున్న అగ్నిస్తంభాలు పక్కన నిప్పుటేరులో అడపాదడపా కొట్టుకుపోతున్న జీవాలు అంతటా ఒకటే తపన ఒక చల్లని మబ్బుతునక రెప్పలపై వాలాలని సమస్తంగా విస్తరించిన తీవ్రమైన ఆశ గదిలో ఎదురుగా టేబుల్ పై కుదురుగా కూచున్న మూడు రెక్కల ముద్దుపక్షి ఎప్పుడో తెగిన ప్రాణ ప్రవాహం తరలి వచ్చిన పరవశంతో తల అటూఇటూ తిప్పుతూ గాలిచూపులు చూస్తుంది చెమర్చిన చర్మానికి చల్లని మంత్రగంధం అలదినట్లు విసుగు మటుమాయమౌతుంది 18/6/2014

by Raj Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lQB75E

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి