పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, జూన్ 2014, ఆదివారం

Sriramoju Haragopal కవిత

చెలిమి ఈ బండకు ఎన్ని గుండెకోతలు పెట్టినా నాకేం బాధగా లేదు ఓ పలుగురాయిని రత్నంలా మెరిపించాలనే నీ అనంతప్రయత్నాలు నాకిష్టమే ఒక్కొక్క ముఖపార్శ్వాన్ని తీర్చిదిద్దే నీ శిల్పనైపుణ్యాన్ని అంగీకరిస్తున్నాను పోతేనేం నా అహంకారాలు పొరలు పొరలుగా పెచ్చులూడి ఎన్ని దెబ్బలు తింటేనేం, ఎన్నెన్ని గాయాలు వుంటేనేం నీ కిష్టమేకదా, నీ అరచేతి ఒడిలో చేరడమే నాకానందం లాలి పాడుతున్న నీ పాటలవూయెలలో ఒంలరి జీవితపత్రంపై వూగుతున్న గాలి పాపాయినే నీ వేలిపై అధిరోహించిన హృదయకాంతి అంగుళీయకాలలో నీ ఆత్మీయస్పర్శ నోచుకోవడమే కదా కావాలి ఎంత సన్నని నీ కనుచూపుల నెలపొడుపులు నింగినిండా సముద్రాలు వొంటికి చుట్టుకునో, నదుల్నికాళ్ళకు గజ్జెలుగా కట్టుకునో నువ్వు నడుస్తూ వస్తావు నా కవితలాగా నువ్వు ధరించే పొద్దు ముద్దుటుంగరంలో చిన్ని రాయినయేదాకా నేను నీ చేతిలోనే కదా సానపడిపోతుంటాను అన్ని పొరలు తియ్యి నేను మిగలనీ మిగులకపోనీ నీది మౌనమేగాక, నీది వేదనేగాక, నీది అమ్మతనమే నేను నన్నుపోగొట్టుకునే దాకా ఎదురుచూస్తూనేవుంటా నాకు నువ్వు మాత్రమే........ నేను...

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oKGjqQ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి