పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, జూన్ 2014, ఆదివారం

Santosh Kumar K కవిత

||ఓ వరం.. నాస్తికత్వం|| శీర్షిక : దేవుడు అనేవాడు అస్సలు ఉన్నాడా?? దేవాలయాలు దేవుణ్ణి చేరుకోటానికి మార్గాలా?? దేవుని నమ్మని వాడు దెయ్యాన్ని నమ్ముతాడా?? ఈ ప్రశ్నల సుడుగుండంలో నాలోని ఆలోచనలకి రూపం నేను రాసిన "ఓ వరం.. నాస్తికత్వం" తెల్లారేసరికి గోల పెట్టే సుప్రభాతాలు, అక్కడక్కడ అర్ధమయ్యే అష్టోత్తరాలు, చెప్పిందే చెప్పి విసిగించే సహస్రనామాలు, అవేవి నేను చదవను.. నాకు అనవసరం.. నా కులమేంటో కనుక్కోవాలా?? నా మతంమేంటో మీకు చెప్పాలా?? వినండైతే నేను గోల చేయని మనిషిని, విలువలను అర్ధంచేసుకున్న మానవతావాదిని, మంచిని చెప్పి,చేయాలనుకునే సంఘసంస్కర్తని, ఏంటీ.. ఇలా చెబితే ఒప్పుకోరా? బహుశా అందుకేనేమో ఈ భక్తమహాశయులందరి దృష్టిలో నేనొక మతమెరుగని మూర్ఖున్ని, నేనొక కులమెరుగని కురూపిని, నేను నమ్మని వాడిని నమ్మిన వాళ్ళందరితో దూషింపబడే దోషిని... మరేంచేయను.. నాస్తికుణ్ణి నేను.. ఇలాంటి పిచ్చివాళ్ళని పట్టించుకొని ఇంకొక పిచ్చి వాడిని కాలేను!! #1# జనమంతా మంచోల్లే... పాపమెరుగని పుణ్యాత్ములే... ఎందుకంటే... దండాలు పెట్టేవారే ధరణికోటంతా, కోరికలు కోరేవారైతే కోకొల్లలంట, నేతి కారే వంటలే నైవేద్యాలంట, వండిన ప్రసాదాలన్నీ పైనోడికేనంట, ఆరగించిన స్వామి చల్లగా చుస్తాడంట, పాపాలన్నీ పటాపంచలు కావిస్తాడంట, పూజలూ పునఃస్కారాలు పుణ్యానికంట, ప్రదిక్షణకి తప్పులన్నీ పటాపంచలంట, లెంపలేసుకుంటే చాలు పైనోడు కరిగిపోతాడంట, నీళ్ళని, పాలని నేలపాలు చేస్తారంట, వృధా ఏమాత్రం కాదది అభిషేకం అంట, కొబ్బరికాయలు కొడుతూనే ఉంటారంట, దేవునితో చుట్టరికం ఇలా చవకగా కలపొచ్చంట, ఏంటో భాలేగుంటాయి వింటుంటే ఇలాంటివంతా, మరేంచేయను.. నాస్తికుణ్ణి నేను.. ఇలాంటి విచిత్రాలన్నీ చూసి నవ్వుకుంటాను!! #2# అయినా నాకర్ధంకాదు నాస్తికత్వానికి చోటెక్కడుంది.. అమ్మని నమ్మని మనిషి ఉండడుగా..!! లేదులే అమ్మానాన్నల అవసరం స్వీయ సంపాదన మొదలైనంతవరకే.. ఆ తర్వాత ఆ ముసలి వాళ్లతో పనేముంది, వృద్ధాప్యంలో ఎందుకూ పనికిరారు, వృద్ధాశ్రమంలో వదిలేస్తే సరిపోతుందిలే, అయినా అలా చేయటం పాపం కాదు, కోట్లను ఖర్చు పెట్టి కుంభాభిషేకం చేయిస్తే కోటి తప్పులని చేసినా క్షమార్హులమే!! కానీ నేను వాళ్ళిద్దరని అలా వదిలేయలేను ఏం చేయను.. పూజలు చేయని నాస్తికుణ్ణి నేను పాపం చుట్టుకుంటుందేమోననే భయంతో బ్రతకలేను!! #3# ముక్కుసూటిగా చెప్తాను కొన్ని స్వీకిరించే కర్మను మీకు ఒదిలేస్తూ.. దేవునికి నేనంటేనే ఇష్టం కులమెరుగని నాస్తి(కులం) నాది, అందుకే నేను ఎన్నంటున్నా నన్నేమీ అనడు మరి!! దేవునికి నేనంటేనే ఇష్టం బద్దకమెరుగని బాధ్యతగల పౌరుడుని, భక్తితో భుక్తిని సంపాదించాలనుకునే సోమరిని కాదు మరి!! దేవునికి నేనంటేనే ఇష్టం కానుకలివ్వను.. కోరికలు కోరను, కుదిరితే సాయపడతాను.. చేయూతనిచ్చి చేయందిస్తాను మరి!! దేవునికి నేనంటేనే ఇష్టం కాయాకష్టం మీద బ్రతికేవాడిని, కాషాయం వేసి కాసులు దండుకునే వాడిని కాదు మరి!! దేవునికి నేనంటేనే ఇష్టం నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటాను, భజనలు చేస్తూ బూటకపు బాగోతాలు నడపను మరి!! ఏం చేయను.. నిజాలు నమ్మే నాస్తికుణ్ణి దేవునికి దాసోహం అంటూ కపట భక్తిని చూపలేను#4# ఇంకా చెప్పాలంటే.. దేవుడు మనల్ని ముందుకి నడిపించే ఒక నమ్మకం అంతేగాని అతీత శక్తుల అద్భుతం కాదు!! 'దైవ చింతన' అంటే గోపురాలలో కాపురం కాదు సమాజ శ్రేయస్సుకి చేయూతనిచ్చి, పేదవానికి పిడికెడైనా దానమివ్వటం!! మంత్రాలు చదివితే మరకలు మానవు, ఉపవాసాలు చేస్తే రోగాలు నయంకావు, హారతులిస్తే చేసిన పాపాలు హరించవు, మంచిని పెంచుకుంటే స్వర్గం నీతోనే సంకల్పంతో శ్రమిస్తే సుఖాలు నీవైపే నీలోని అహమే చెడు.. నీలోని ఆలోచనే మంచి.. అందుకే నన్ను నేను ఎప్పుడూ మోసంచేసుకోను!! నా మీద నాకు నమ్మకం నలుగురిని ఆదుకోగలనని, నా మీద నాకు ధైర్యం కష్టాలలో ఎదురీదగలనని, నా మీద నాకు గౌరవం నా కాళ్ళమీద నిలబడగలనని, నాకేమీ తప్పు అనిపించటం లేదు.. అందుకే నా లెక్కలో ఓ వరం.. నాస్తికత్వం!! #5# #సంతోషహేలి 08JUN14

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mr3X95

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి