పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, జూన్ 2014, ఆదివారం

Viswanath Goud కవిత

నేను-మా అమ్మ|విశ్వనాథ్| రేపటికల్లా నేనిచ్చిన హోమ్ వర్క్ పూర్తి చేయలేదో గద్ధించాడు మాస్టారు ఆ గంభీరమైన కంఠానికి జడివానకు తడిసిన వానిలా గజగజ వణికిపోతూ గధ్గద స్వరంతో అలాగే మాస్టారు అంటు ఇంటికి వెళ్ళగానే అమ్మతో.... అమ్మ నేను ఏం చేయకపోయినా మా మాస్టారు నన్ను కొడతానంటున్నారమ్మా అంటూ రెండు కన్నీటి బొట్లు రాలుస్తూ ఓ చాడింపు రాయి మాస్టారు మీద విసిరేసాను.... అది సరాసరి వెళ్ళి అమ్మ గుండెకు తగిలింది... అమ్మ విలవిల్లాడిపోతు భాదతో ఏం చేయకపోతే ఎందుకు కొడతారు రా.... సరే నువ్వెళ్ళి పడుకో... రేపు నేనొచ్చి మాట్లాడతా అని నన్ను అమ్మ పడోకొబెట్టింది.... ఉదయం ఇంకా పూర్తిగా తెలవారి సూర్యుడింకా రాకముందే అమ్మ ఇంట్లో ఓ దీపం వెలిగించి అన్ని పనులు ప్రతిరోజు కంటే ముందే ఆ రోజు చక్కబెట్టేసుకుని నన్ను బడికి వెంటబెట్టుకుని వెళ్ళింది. వెళ్ళి వెళ్ళగానే మా మాస్టారు మీద పిడుగులా పడింది. అపుడు మాస్టారు ముఖం పిడుగు ధాటికి మాడిపోయిన చెట్టు కొమ్మలా అయింది.. మాస్టారు నెమ్మదిగా తేరుకుని ఏమయిందమ్మా ఎందుకలా ఆవేశంతో గాలివానకు పొంగిన తుంగలా పరవళ్ళ చిందులు తొక్కుతున్నారు అన్నాడు... అపుడు అమ్మ ఎందుకు మా వాడు ఏం చేయకపోయినా కొడతానంటున్నావంట అంటూ నిలదీసింది... మాస్టారు ముక్కున వేలేసుకుంటూ., ఓరి....బడవా...ఎంత తెలివి మీరి పోయావురా... అంటూ నేను వాడు ఏం చేయకపోతే కొడతానన్నానో అడగండి అంటు అమ్మను అన్నాడు.. అమ్మ అడిగేసరికి నా ముఖం ఆంజనేయుడు మింగిన పండుసూరీడిలా ఎర్రబడిపోయింది... అది కాదమ్మ మాస్టారు రేపు నేనిచ్చిన హోమ్ వర్క్ పూర్తి చేయకపోయావో నీకు దెబ్బలు పడతాయి అని అన్నారని అసలు విషయం కలుగులోంచి బయటకొచ్చిన ఎలుకపిల్లలాగా బయటపెట్టాను..! కాల ప్రయాణంలో కొన్ని సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి తిరిగి మళ్ళీ అదే లాంటి కర్కశమైన స్వరంతో మా బాస్ గద్దింపు... రేపటిలోగా అకౌంట్స్ మొత్తం పూర్తి చేసి నా టేబుల్ మీద పెట్టక పోయావో నీ ఉద్యోగం ఊస్టింగే అంటూ.... నాడు అమ్మ నన్ను వెనకేసుకొచ్చింది మరి నేడు ఏ అమ్మకు ఏమని చాడీ చెప్పను ...ఎలా చెప్పను... నేనేమో భూమ్మీద...అమ్మెక్కడో పైన ఆ స్వర్గంలో.! 08జూన్14

by Viswanath Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ht4f2O

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి