పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, మే 2014, గురువారం

బాలసుధాకర్ మౌళి కవిత

ప్రకటన పాము బుసకొట్టదు కాటేయదు మెత్తగా సుతారంగా మునివేళ్లతో వొళ్లంతా రాస్తున్నట్టు - ఆలోచనల పుట్టలోకి చొరబడుతుంది అణువణువునూ ఆవరిస్తూ మండీ వేసుకుని కూర్చుంటుంది అది అప్పుడప్పుడూ తల పైకెత్తి చుట్టూరా చూస్తుంది నిద్రలో కళ్ల ముందుకొచ్చి తైతిక్కలాడుతుంది ఊపిరికొసల్ని ముడేసి వొళ్లంతా పాకుతుంది వొదలదు - యింటిలోకీ వొస్తుంది భార్యామణుల ఊహల్లోకి మరీ మరీ వొస్తుంది దాన్ని చూసి పిల్లలంతా మారాం చేస్తారు దాని మీదికెక్కాల్సిన బదులు దాన్నే మీదికెక్కించుకోవాలని మహా ఉబలాటం పడతారు ప్రకటన పాము ఎవ్వరినీ వొదలదు - కొద్ది రోజుల్లోనే వచ్చిన పని అయిందనుకున్నాక మరో పుట్టని వెతుక్కుంటుంది మాయలమారి 'ప్రకటన పాము' - ఆలోచనల పుట్టలోనివే 'తెలివిడిచీమల'న్నీ వొక్కటై చుట్టూరా దడి కట్టి దాడిచేస్తే అంత బడాయి పామూ చచ్చి ఊరుకుంటుంది ! * నేనిప్పుడు ప్రకటన పాముకు పాడె కట్టాలి నువ్వో చెయ్యేస్తావా.... ? రచనా కాలం :29 మే 2014 -------------------------------- 29.05.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lU1bsx

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి