పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, మే 2014, మంగళవారం

Krishna Mani కవిత

పటేలా ! _________________________కృష్ణ మణి మొగులుమీదినుండి దిగొచ్చిన సందమామలెక్కున్నవు పటేలా ఈ తెల్ల బట్టలల్ల ఏడ లేడు నీయసొంటి దొర నడుస్తే పెద్దేనుగులు పందికోక్కోలె ఉరుకుతయి సందులెంట బాంచెన్ దొర నీ కాళ్ళు మొక్కుత ! మాలెసపొద్దుకు ముందే మీ గడీల తల దించెటోళ్ళం పటేలా మాతోలు పీకి చెప్పులు కుట్టిస్తం దొర శేరు గుంజాలకు గులాంలము పటేలా పేరుకు మల్లయ్యను మీకాడ మాదిగి మల్లిగాన్ని దొర ! కడుపుకి కష్టం దప్ప ఇంకేమిలే మాదొర మీ సుఖాలను జూసుడే మా సుఖం పటేలా ! దేవునివి పటేలా నీ బండి సప్పుడికి చెప్పులిడిషి నెత్తి ఒంచుతం పటేలా ! నీకన్ను బడితే పక్క పాన్పులే దొర కన్నేర్రజేస్తే కాటికే పోతం పటేలా ఒగనికష్టం ఇంకోగరం సేప్పుకుబతుకుతున్నం దొర పగాని ముచ్చటలేని పసిపోరాలం పటేలా ! పాట పాడి ఆటలాడుతాం దొర సగంల నువ్వొస్తే అలసిన పానాన మల్ల మొదలైతాది పటేలా నువ్వు జెప్పిందే ఏదం నువ్వు అన్నదే నాయం దొర లోకం ఎరుగని ఎడ్డి గోర్రెలం పటేలా ! అని పల్వరించే మా తాత నిద్రమత్తుల మరువని మచ్చలు యాదికొచ్చి కుములుతున్నడు ఆ రోజుల్ల నేనుంటే తేజాబ్ కత్తినైతుంటి ! కృష్ణ మణి I 20-05-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1naH1RJ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి