పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, మే 2014, మంగళవారం

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్..>>>>>>>> ||తిరోగమనం || ================================= జ్ఞాపకాలు ఒక్కోసారి గునపాలై గుచ్చుకుంటున్నాయి గుండె పొరల్లో దాచుకున్న ఆశల దొంతరలు ఒక్కొక్కటి తరిగిపోతున్నాయి కాలం కంగారై పరిగెడుతోంది ఎడారి స్వప్నం కళ్ళముందే కదలాడుతుంది కాలే కడుపులు దహించుకుపోతున్నాయి ఎప్పుడో గుచ్చుకున్న ముళ్ళు ఇప్పుడు ధనుర్వాతమయ్యింది పాదాలు రక్తం చిందుతూనే ఉన్నాయి కులమే క్యాన్సరై వెక్కిరించింది కులచికిత్స లేని పల్లెలు మూగబోతున్నాయి మట్టివాసన మాత్రం ముక్కుపుటల్ని కట్టిపడేస్తుంది అంకురాలు కేళీలవుతున్నాయి ఎక్కడో సముద్రంలో జరిగే తరంగాలు విని కుక్కలు అరుస్తున్నాయి శకునమనుకునే సాహిత్యం క్షుద్రమై శనిలా దాపురించింది కులరాజ్యం రేబిస్ లా ఆజ్యం పోస్తుంది తామరాకు మీద నీటి బిందువు జీవితమై తొణికిసలాడుతుంది ఎటూ దిక్సూచి లేని గమనం, పయనాన్ని ప్రశ్నిస్తుంది కాల గమనం లో మార్పులు శస్త్ర చికిత్స కోసం అన్వేషి స్తున్నాయి నల్ల రేగడి బీటలు తీసింది ఎదురు చూస్తున్న కళ్ళల్లో దైన్యం అధైర్యమై పరుగులు తీసింది నాడులు కొట్టుకుంటున్నాయి నరాలు ఒకే రక్తాన్ని ప్రవహిస్తున్నాయి తరాలు మారటం లేదు అంతరాల మధ్య ఆగిపోతున్నాయి భూమి గుండ్రం గా ఉందన్న గెలీలియా ఆపిల్ ద్వారా గురుత్వాకర్షణ కనిపెట్టిన న్యూటన్ జీవపరినమ క్రమాన్ని చెప్పిన డార్విన్ మళ్ళా పుట్టరేమి ? అవున్లే ! ఇప్పుడు కూడా ఖగోళాన్ని ముహూర్తాలతో తాకట్టు పెట్టేసారు భూములకు కూడా రెక్కలు కట్టేశారు అప్పుడు వానర పరిణామం నరుడైతే ఇప్పుడు నరుడే వానరం గా మారుతున్నాడు తిరోగమనం లో తస్మాత్ జాగ్రత్త ! =================== మే 20/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mQcQwn

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి