పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, ఏప్రిల్ 2014, బుధవారం

Patwardhan Mv కవిత

పట్వర్ధనీయాలు::: సీసా పెంకుల వట పత్ర శాయి చెత్త కుండీలో వదిలిన పేరులేని పాపాయి *********************************** కమలంలో చిక్కిన తుమ్మెద పలవరిస్తున్నది స్వేచ్ఛ! *********************************** నేను నిజంగా నిజాన్ని నమ్ముతా నిజాన్నే తుమ్ముతా ! *********************************** తప్పిపోయిన శాంతి కోసం వెతుకుతున్నాను అశాంతీ ! నీకేమన్నా కనిపించిందా ?? ************************************ ఇల్లు ఖాళీ చేయాలి ఇంకో ఇల్లెక్కడో ఏమో మరి :( ************************************ నన్ను రక్షించుడీ సన్యాసుల్నుండీ సన్నాసుల్నుండీ ! ************************************ బాల్యం విస్ఫోటించింది మూల్యం సమాజం చెల్లించింది. ************************************ సైనేడు నవ్వుల లోకం సత్యవ్రతా! జాగ్రత్త. ************************************ గడ్డిపోచ కోరుకుంటున్నది ఓట్ల పండుగ ఒడిసిపోవద్దని. ************************************ శిథిలమైన మనస్సులో శిలీంద్రాలు మొలుస్తాయి. *********************************** ప్రభూ!! విశ్వ రూపం ఈ కళ్ళతో చూడలేను హిజ్ ఎక్సలెన్సీ హిపోక్రాట్ కళ్ళియ్యి. *********************************** చంద్రున్లో మచ్చ పేదరాశి పెద్దమ్మదీ,కదలని కుందేలుదీ కానే కాదు. అచ్చం తుపాకీ పట్టిన నా చిన్న కొడుకుదిలా లేదూ? ************************************** వేటగాడికి తెలిసింది నేను కలల కుందేళ్ళను పెంచుతున్నానని! 02-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jZ9bO0

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి