పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, ఏప్రిల్ 2014, బుధవారం

Kapila Ramkumar కవిత

సరుకై వచ్చిన రొయ్యలు తిమింగలలాలైపోడం మాయ చుట్టమై వచ్చిన వాడు దయ్యమై పట్టుకునే కుట్రొక మాయ దోపిడీ యుద్దం కోసం కట్టిన వారధి అభివృద్ధి రహదారి కానేకాదు. ఎన్నిసార్లు ఎల్లగొట్టినా కోడికి ఎండుగు మీదనే కన్ను! ఒకడు పాగా వేసి చొరబడితే ఒకడు జాగానే నాదన్నాడు మరొకడు బతుకులన్నీ చిందరవందర చేసి సుందర నగరాన్ని నిర్మించానన్నాడు. నువ్విక్కడ అడుగుపెట్టిన తర్వాత మాకు వెన్నెల వెలుగునుంచి మాయా కాంతిలోకి వచ్చినట్లైంది. పల్లెతల్లి ఒడినుంచి అనాథాశ్రమంలోనికి వచ్చినట్లైంది. నువు చూపే నగర సంపదకు లిట్మస్‌ టెస్ట్‌ చేసి చూద్దాం. అది తప్పకుండా నువు మా ముఖం మీద చల్లిన ఆమ్లమనే తేలిపోతుంది నీ సిమెంట్‌ బలుపు భవనాలకు అగ్ని పరీక్షలు నిర్వహిద్దాం అప్పుడు మా నెత్తురు కాలిన వాసనే వస్తుంది ఈ నగరం తళుకు బెళుకుల్లో మా చెమట చుక్కల మెరుపుంది ఈ అరవై ఏండ్లకాలం నీ ముసుగును తొలగించింది నీ కుట్రల కండ్ల మంటది ఒక్కనాలుకైతే మాది వేయి నాలుకల పోరాట జ్వాల కాటికెల్లినా పోని పగనీదైతే కడుపుల దాచుకునే ప్రేమ మాది మా భద్రాచల రామదాసు కారాగారంలోంచి దుఃఖపు రాగమై అడుగుతున్నడు ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవని! నవ్వుతూ విషాన్ని చిమ్మడం నీకే చెల్లును నాయకా! హైదరాబాద్‌ను చూసిన మొఖం తోనే అటుగూడ జూడాలె గొలుసులు తెంచుకున్న పులులనాప ఇగ ఎవల తరం గాదు! http://ift.tt/1pLf2FK

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pLf2FK

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి